విజయమ్మను ఓడిoచినందుకే కక్ష కట్టారు

 

2014 నాటి ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ నుంచి పోటీ చేసిన విజయమ్మను అక్కడి ఓటర్లు ఓడిరచారని ఆ అక్కసుతోనే విజయసాయి రెడ్డి వంటి నాయకులు విశాఖలో తిష్ఠ వేసి, ప్రజలపై కక్షసాధింపు చర్యలకు దిగారని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర, విశాఖ కేంద్రంగా విజయసాయి, అవంతి శ్రీనివాస్‌ టీడీపీ బీసీ నేతలపై కుట్ర రాజకీయాలు, కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు. విజయసాయి అల్లుడు వైసీపీలో చేరమని పల్లా శ్రీనివాసరావుని అడిగితే నిరాకరించారని తెలిపారు. విశాఖలో అధికార పార్టీకి పట్టులేదని, టీడీపీలోని బీసీ నేతలను బెదిరిస్తూ, వేధిస్తున్నారని మండిపడ్డారు. రాజ్య సభ సభ్యత్వం ముగిసిన వెంటనే విజయసాయి విశాఖ ఎంపీగా పోటీ చేసి, ప్రజల్లో తనకున్నఆదరణ రుజువు చేసుకోవాలని సవాల్‌ చేశారు. దొంగలు, దోపిడీదారులు, కబ్జాకోరులు వైసీపీలో ఉంటే, టీడీపీ వారిని కబ్జాకోరులంటారా అని ప్రశ్నించారు. బయటినుంచి వచ్చిన విజయసాయి, అవంతి విశాఖవాసులను అమాయకుల్నిచేసి చెడుగుడు ఆడుతున్నారని మండిపడ్డారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *