పరీక్షలు నిర్వహిస్తే లక్షల మంది ప్రాణాలకు ముప్పు

 

పరీక్షలు నిర్వహిస్తే లక్షల మంది ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ ద్వారా తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసిన లోకేష్‌, ప్రభుత్వం పరీక్షలు రద్దు చేస్తే, జగన్‌ సర్కార్‌ కు తాను రాసిన ప్రతి ఒక లేఖను వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడిరచారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడిన ఆయన, ఐదు లక్షల మంది విద్యార్థుల అభిప్రాయాలను పొందిన తరువాత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, గవర్నర్‌ బిస్వ భూషన్‌ హరిచందన్‌ లకు లేఖలు రాసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. 12 వ తరగతి సిబిఎస్‌ఇ పరీక్షలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత మెజారిటీ రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేశాయని, అయినప్పటికీ ఏపీ సీఎం పరీక్షలను రద్దు చేయలేదని లోకేష్‌ విమర్శించారు. పరీక్షలు జరిగితే లక్షలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా మహమ్మారి బారిన పడే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణపై మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ విద్యార్థుల ప్రాణాలు కాపాడటం కోసమే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పోరాటం చేస్తుందని లోకేష్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌ పరీక్ష లను రద్దు చేయాలన్న తన డిమాండ్‌ను నారా లోకేష్‌ పునరుద్ఘాటించారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *