బాలీవుడ్‌ హీరోయిన్‌ అరెస్ట్‌

 

‘36 చైనా టౌన్‌’ ‘అగ్లీ ఔర్‌ పగ్లి’ ‘ధోల్‌’ ‘దిల్‌ కబడ్డీ’ వంటి చిత్రాలలో,.. ‘బిగ్‌ బాస్‌’ సీజన్‌ 2 లో పాల్గొన్న బాలీవుడ్‌ పాయల్‌ రోహత్గిని సోషల్‌ మీడియాలో బెదిరింపులకు పాల్పడిరదనే ఆరోపణలపై పోలీసులు అరెస్ట్‌ చేశారు. వాట్సాప్‌ గ్రూపులో పాయల్‌ తన హౌసింగ్‌ సొసైటీ చైర్‌ పర్సన్‌కు బెదిరింపు సందేశాలు పంపినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. రోహత్గి ఆ మెసేజులను డిలీట్‌ చేసినప్పటికీ.. సొసైటీ మెంబెర్‌ అయిన డాక్టర్‌ పరాగ్‌ షా ఫిర్యాదు చేయడంతో అహ్మదాబాద్‌ శాటిలైట్‌ పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. పాయల్‌ రోహత్గి జూన్‌ 20న సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. అయితే పాయల్‌ ఆ సోసైటీలో సభ్యురాలు కాకపోవడంతో ఆమెను మాట్లాడకూడదని కోరారు. ఈ నేపథ్యంలో వారితో నటి వాగ్వాదానికి దిగింది. అంతేకాదు తనతో వాదించే ఎవరికైనా కాలు విరిగిపోతాయని.. చైర్‌ పర్సన్‌ను చంపేస్తానని వాట్సాప్‌ గ్రూప్‌లో మెసేజ్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాయల్‌ ను అహ్మదాబాద్‌లో అరెస్ట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *