మోడర్నా వ్యాక్సిన్‌ కూడా రెడీ

 

అమెరికాకు చెందిన మోడర్నా కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ఆమోదం లభించింది. ఈ వ్యాక్సిన్‌ దిగుమతి, అమ్మకాల కోసం మల్టీ నేషనల్‌ ఫార్మా కంపెనీ సిప్లాకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతిని మంజూరు చేసింది. దీంతో దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల జాబితాలో కోవీషీల్డ్‌, కోవాగ్సిన్‌, స్పుత్నిక్‌-వీతోపాటు నాలుగవ వ్యాక్సిన్‌ మోడర్నా చేరింది. డిసెంబరు చివరి నాటికి భారతీయులందరికీ వ్యాక్సిన్‌ అందించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా దేశంలో వ్యాక్సిన్‌ పంపిణీకి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. కాగా మెడర్నావ్యాక్సిన్‌ దిగుమతికి అనుమతిని కోరుతూ డీసీజీఐకి సిప్లా దరఖాస్తు చేసుకుంది. 90 శాతం సమర్ధతను కలిగి ఉన్న రెండు డోసుల మోడర్నా ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి కెనడా, అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతినిచ్చింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *