తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తోంది

 

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌..పర్యావరణ శాఖా మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు తెలంగాణ – ఏపీ మధ్య నీటి జగడం పైన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ లేఖలు రాసారు. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని.. కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని వినియోగిస్తోందని సీఎం జగన్‌ లేఖలో వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిల్వలు ఉండకుండా తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఈనెల 1 నుంచి ఇప్పటి వరకు 19 టీఎంసీల నీటిని వినియోగించుకుందని వివరించారు. ఉమ్మడి ప్రాజక్టుల్లో సాగు..తాగు..విద్యుత్‌ కోసం వినియోగించే నీటిని క్రిష్ణా బోర్దు పరిధిలోకి తేవాలని ముఖ్యమంత్రి కోరారు. పాలమూరు రంగారెడ్డి, దిండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులను 800 అడుగుల వద్ద పర్యావరణ అనుమతి లేకుండా తెలంగాణ నిర్మిస్తోంది. ఈ అక్రమ ప్రాజెక్టు వల్ల శ్రీశైలంలో 854 అడుగుల నీరు ఉండే అవకాశాలు లేవని సీఎం జగన్‌ తన లేఖలో చెప్పుకొచ్చారు. కేఆర్‌ఎంబీ పదే పదే ఏపీలో పర్యటన కోసం అడగటాన్ని సీఎం ఆక్షేపించారు. ముందుగా తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టుల ప్రాంతాల్లో పర్యటించిన తరువాత ఏపీలోకి వెళ్లేలా కేఆర్‌ఎంబీని ఆదేశించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *