కరోనా వ్యాక్సిన్‌తో కంటిచూపు

కంటిచూపు కోల్పోయిన మహిళకు కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్న తర్వాత కంటి చూపు రావడం విశేషం. ఈ ఘటన మహారాష్ట్రలోని వాషిమ్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వాషిమ్‌ జిల్లా బెందర్వాడి గ్రామానికి చెందిన 70 ఏళ్ల మధురాబాయి బిద్వే అనే మహిళకు కంటిశుక్లం సమస్యతో తొమ్మిదేళ్ల క్రితం చూపుకోల్పోయింది. అప్పట్నుంచి ఆమె చీకటి జీవితాన్నే గడుపుతోంది. ఆమె తన బంధువులతో కలిసి రోసడ్‌ తహసీల్‌లో నివాసముంటోంది. అయితే, కరోనావైరస్‌ వ్యాప్తి చెందుతున్న క్రమంలో మధురాబాయి కూడా బంధువుల సహాయంతో కరోనా వ్యాక్సిన్‌ వేసుకుంది. జూన్‌ 26న వ్యాక్సిన్‌ కేంద్రానికి వెళ్లి ‘కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌’ మొదటి డోసు వేయించుకుంది. ఆ తర్వాత ఆమెకు కంటిచూపు క్రమంగా మెరుగుపడుతూ వచ్చింది. ఇప్పుడు 30-40 శాతం దాకా కంటిచూపు మెరుగుపడిరదని మధురాబాయి తెలిపింది. తాను కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత నుంచే తనకు కంటిచూపు మెరుగుపడుతోందని మధురాబాయి ఆనందం వ్యక్తం చేస్తోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *