వచ్చే నెల నుంచే కరోనా థర్డ్‌ వేవ్‌

 

వచ్చే నెలలోనే (ఆగస్ట్‌) కరోనా థర్డ్‌వేవ్‌ మొదలయ్యే అవకాశాలున్నాయని ఎస్‌బీఐ తాజా సర్వే హెచ్చరించింది. సెప్టెంబర్‌ నెలలో కరోనా కేసుల నమోదు శిఖరాన్ని తాకుతుందని కూడా అంచనా వేసింది. ‘కోవిడ్‌-19: ద రేస్‌ టు ఫినిషింగ్‌ లైన్‌’ పేరుతో ఎస్‌బీఐ ఒక పరిశోధన నివేదికను విడుదల చేసింది. దేశంలో సెకండ్‌ వేవ్‌ పీక్‌ మే 7వ తేదీన నమోదైందని ఈ నివేదిక వెల్లడిరచింది. ప్రస్తుతం డేటా ప్రకారం జులై రెండో వారంలో రోజుకు 10 వేల చొప్పున కేసులు నమోదు కావచ్చని, అలాగే ఆగస్ట్‌ 15 తరువాత కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరగొచ్చని ఎస్‌బీఐ రిపోర్ట్‌ అంచనా వేసింది. మరోవైపు కరోనా నిబంధనలు పాటించకపోతే అక్టోబర్‌-నవంబర్‌ మధ్య థర్డ్‌వేవ్‌ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ప్రభుత్వ ప్యానెల్‌ శాస్త్రవేత్త హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే రెండో వేవ్‌తో పోలీస్తే రోజువారీ కేసుల సంఖ్య సగానికి తగ్గవచ్చన్నారు. దేశంలో లక్షా, 50 వేలనుంచి 2 లక్షల వరకు కేసులు నమోదు కానున్నాయని ప్యానెల్‌ సభ్యులు, ఐఐటీ కాన్పూర్‌ శాస్త్రవేత్త అగర్వాల్‌ హెచ్చరించారు. గ్లోబల్‌ డేటా అంచనాల ప్రకారం సెకండ్‌ వేవ్‌తో పోలిస్తే కరోనా థర్డ్‌ వేవ్‌ సగటు ఉధ ృత కేసులు 1.7 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. చారిత్రక పోకడల ఆధారంగా ఆగస్ట్‌ 12 తరువాత కేసుల సంఖ్య క్రమంగా పుంజుకుని, నెల తరువాత పీక్‌ స్టేజీకి వెళ్లేఅవకాశం ఉంది. అలాగే దేశంలో సగటున రోజుకు 40 వ్యాక్సిన్లు ఇస్తుండగా, దేశంలో రెండు డోసుల వ్యాక్సిన్‌ వేసుకున్న వారు 4.6 శాతంగా ఉన్నారు. ఇక తొలి డోసు తీసుకున్వారు 20.8 శాతం మంది మాత్రమే. యుఎస్‌, యుకె, ఇజ్రాయెల్‌, స్పెయిన్‌, ఫ్రాన్స్‌తో సహా ఇతర దేశాల కంటే ఇది ఇప్పటికీ తక్కువే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *