విశాఖకు అన్యాయం జరుగుతుంటే హరిబాబు ఎందుకు మాట్లాడటం లేదు

విశాఖకు అన్యాయం జరుగుతుంటే మిజోరాం గవర్నర్‌ గా ఎంపికైన కంభంపాటి హరిబాబు ఎందుకు మాట్లాడటం లేదని సీపీఐ నేత నారాయణ ప్రశ్నించారు. స్టీల్‌ ప్లాంట్‌కు న్యాయం జరిగేంత వరకు మిజోరాంకు తాను వెళ్లనని హరిబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్లాంటు ప్రైవేటీకరణను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆపగలరని చెప్పారు. ప్లాంటు ప్రైవేటు పరం కాకుండా ఆపే శక్తి వెంకయ్యకు ఉందని… ఆయన నోరు విప్పాలని కోరారు. ప్లాంటు గురించి కోర్టుకు వెళ్లడం వల్ల ఉపయోగం లేదని… ప్రాణ త్యాగాలకు సిద్ధం కావాలని నారాయణ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ కాళ్లమీద పడే విజయసాయిరెడ్డి… వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ గురించి ఎందుకు మాట్లాడటం లేదని సీపీఐ నేత నారాయణ ప్రశ్నించారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఢల్లీిలో తాము ధర్నాకు యత్నించామని… అయితే, విజయసాయి వల్ల అది జరగలేదని విమర్శించారు. మోదీకి సీఎం జగన్‌ రాస్తున్న లేఖల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అన్నారు. ప్రత్యక్ష ఆందోళనల్లో జగన్‌ పాల్గొంటేనే ఫలితం ఉంటుందని చెప్పారు. స్టీల్‌ ప్లాంట్‌ మెయిన్‌ గేటు వద్ద ఉన్న శిబిరానికి జగన్‌ రావాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *