ఆఫ్ఘనిస్థాన్‌ పునర్నిర్మాణంలో చైనా పాత్ర

ఆఫ్ఘనిస్థాన్‌ పునర్నిర్మాణంలో చైనా పాత్ర ఉండాలని తాము కోరుకుంటున్నామని తాలిబాన్‌ అధికార ప్రతినిధి సుహైల్‌ షహీన్‌ చెప్పారు. ఈ మేరకు తాలిబాన్‌ అధికార ప్రతినిధి సుహైల్‌ షహీన్‌ ప్రకటన విడుదల చేశారు. చైనాలోని షిన్‌ జియాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఉయ్‌ ఘర్‌ వేర్పాటువాదులకు తాము మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. అంతేకాదు ఉయ్‌ ఘర్‌ ముస్లింలను తమ దేశంలోకి అడుగుపెట్టనివ్వబోమని తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌ ్‌ నుంచి అమెరికా బలగాలు వైదొలగిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన వెంటనే అక్కడి తాలిబాన్‌ ముష్కరులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్‌ లోని పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంతేకాదు, కాందహార్‌ను స్వాధీనం చేసుకోవడానికి అడుగులు వేస్తున్నారు. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్న 210 మంది తమ పౌరులను చైనా వెనక్కి తీసుకెళ్లింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని అంతర్గత ఘర్షణలపై డ్రాగన్‌ కంట్రీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తాలాబాన్లు కీలక ప్రకటన చేశారు. చైనాను ఆఫ్థనిస్థాన్‌ మిత్ర దేశంగా భావిస్తుందని తాలిబాన్లు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *