చంద్రబాబు మూడు కళ్ల సిద్ధాంతం

చాలా విషయాల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుది రెండు కళ్ల సిద్ధాంతమని ఆయన ప్రత్యర్థులు విమర్శలు చేస్తుంటారు. తాజాగా ఆ పార్టీ నేతలు ప్రకాశం జిల్లా టిడిపి నేతలు ముగ్గురు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి వీరాంజయనేయస్వామి, ఏలూరి సాంబశివరావులు సీమ ఎత్తిపోతల పథకం వల్ల ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతుందంటూ సీఎం జగన్‌కు లేఖ రాశారు. జిల్లాలో నీటి వనరులు చాలా తక్కువ అని… సాగర్‌కు రావాల్సిన నీటిని పైన మళ్లించేస్తే చివరి ఆయుకట్టులో ఉన్న ప్రకాశం జిల్లాకు నీరు అందదని వారు లేఖలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో చంద్రబాబు మూడు కళ్ల సిద్ధాంతం అమలు చేస్తున్నారా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న జల వివాదంపై చంద్రబాబు తన అభిప్రాయం చెప్పడం లేదు. అయితే టీడీపీ వాళ్లు మాత్రం మూడు విధాలుగా మాట్లాడుతున్నారు. ఈ లెక్కన టిడిపి సీమ ఎత్తిపోతల పథకం విషయంలో కూడా ఒక వైఖరితో కాకుండా మూడు వైఖరులతో ఉందనే అర్థమవుతోంది. ఏపీలోనే రెండు స్టాండ్లు తీసుకోవడం వారికే చెల్లింది..! సీమ ఎత్తిపోతల పథకంపై వ్యతిరేకంగా మాట్లాడితే బాబు టీడీపీపై సీమలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అసలే సీమలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రం. ఒక వేళ సమర్థిస్తే తెలంగాణలో పార్టీ నేతల నుంచి వ్యతిరేకత ఉంటుంది. అసలే తెలంగాణలో పార్టీ లేదు ? అనుకుంటున్న టైంలో దీనిని సమర్థించి పార్టీకి ఘోరీ కట్టుకోలేరు. అందుకే చంద్రబాబు ఈ విషయంలో పూర్తి మౌనంగా ఉంటున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *