కత్తి మహేష్‌ మృతిపై పోలీసుల విచారణ

కత్తి మహేశ్‌ మరణంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్‌ అధినేత మంద కృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. కత్తి మహేశ్‌ ప్రమాదం జరిగిన తీరు అనుమానాస్పదంగా ఉందని, రోడ్డు ప్రమాదంలో కారు కుడిభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయినప్పటికీ డ్రైవర్‌ సురేశ్‌ స్వల్పగాయాలతో బయటపడటం, ఎడమ వైపు కూర్చున్న మహేశ్‌కు తీవ్రంగా గాయపడటం అనుమానాలకు తావిస్తోందన్నారు.త్తూరు జిల్లాలోని మహేశ్‌ స్వగ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మార్పీఎస్‌ అధినేత మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేశారు. కత్తి మహేష్‌ మృతిపై తమకూ అనుమానాలున్నాయని ఆయన తండ్రి ఓబులేషు పేర్కొన్నారు. మహేష్‌ చనిపోయిన విషయాన్ని తమకంటే ముందే బయటకు చెప్పారని ఆయన తెలిపారు. కత్తి మహేశ్‌ మ ృతిపై న్యాయ విచారణ జరిపించి నిజానిజాలు బయటపెట్టాలని కోరారు. వయసు రీత్యా తన శరీరం సహకరించడం లేదని, ప్రభుత్వమే విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని ఆయన కోరుతున్నారు. కత్తి మహేశ్‌కు చాలామంది శత్రువులున్నారని.. గతంలోనూ ఆయనపై అనేక దాడులు జరిగాయని మంద కృష్ణ మాదిగ గుర్తుచేశారు. ఈ ఉదంతంపై లోతుగా దర్యాప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఆయన డిమాండ్‌పై స్పందించిన జగన్‌ సర్కార్‌… కత్తి మహేశ్‌ మరణంపై విచారణకు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మహేశ్‌ కారు డ్రైవర్‌ సురేష్‌ను విచారణకు పిలిచారు. ప్రమాదం జరిగిన తీరు, కత్తి మహేష్‌ తీవ్రంగా గాయపడితే డ్రైవర్‌ సురేష్‌కు ఎందుకు చిన్నగాయం కూడా కాలేదన్నది అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదం తర్వాత ఏం జరిగిందన్న దానిపైనా పోలీసులు ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *