శని, ఆదివారాల్లో కేరళలో లాక్‌డౌన్‌

దేశవ్యాప్తంగా నమోదవుతోన్న కొత్త కేసుల్లో కేరళ, మహారాష్ట్రదే సగానికి పైగా వాటా ఉంది. ఈ ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు కేరళ ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ వైపు మొగ్గుచూపింది. జులై 17, 18న పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం కేరళలో 14 వేలకు పైగా కేసులు వెలుగుచూడగా.. మహారాష్ట్రలో ఆ సంఖ్య ఏడువేలకు పైనే ఉంది. కాగా దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. మంగళవారం 19,15,501 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 38,792 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. క్రితంరోజు కంటే కొత్త కేసుల్లో 23 శాతం పెరుగుదల కనిపించింది. దాంతో మొత్తం కేసులు 3.09కోట్లకు చేరాయి. మంగళవారం మరో 624 మంది మహమ్మారికి బలయ్యారు. ఇప్పటివరకు 4,11,408 మంది ప్రాణాలు కోల్పోయినట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *