టీడీపీకి మరో సీనియర్‌ గుడ్‌ బై

 

 

తెలుగుదేశం పార్టీకి మరో సీనియర్‌ గుడ్‌ బై చెప్పేసారు. విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎమ్మెల్యేగా, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన శోభా హైమావతి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలను భరించలేక పార్టీని వీడుతున్నట్లు ఆమె ప్రకటించారు. పార్టీలో తగిన గుర్తింపు లేదంటూ శోభా హైమావతి ఆవేదన చెందారు. పార్టీ కోసం కష్టపడుతున్నవారిని పక్కన పెడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *