ఎంపీ రఘురామ సభ్యత్వ రద్దు ఖాయం

 

వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామ సభ్యత్వ రద్దు ఖాయమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కే నారాయణ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం లోక్‌ సభ స్పీకర్‌ వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ రాజుకు అనర్హత పిటీషన్‌ పైన నోటీసులు ఇచ్చిన అంశం పైన నారాయణ స్పందించారు. జగన్‌ పార్టీలో ఉంటూ ఆ పార్టీ విధానాలు వ్యతిరేకంగా నిత్యం వ్యవహరిస్తున్న రఘు రామ సభ్యత్వాన్ని రద్దు చేయమని కొరడంలో తప్పు లేదని నారాయణ పేర్కొన్నారు. జగన్‌ బెయిలు రద్దు చేయాలని రఘురామ పిటిషన్‌ వేయడాన్ని నారాయణ తప్పు బట్టారు. పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణలో ఈటెల రాజేంద్ర తరహాలో పోరాటం చేసి ఉంటే బాగుండేదని తెలిపారు. ఒక వేళ రఘురామ కోరుకున్నటు జగన్‌ బెయిలు రద్దు అయితే ఏమి అవుతుందని ప్రశ్నించారు. ఇంతకు ముందే జగన్‌ 16 నెలలు జైలులో ఉన్నారని…ఆ సింపతితో ఎన్నికల్లో గెలిచారని తెలిపారు. మరోసారి జైలుకు వెళితే ఆయన అర్ధ ఆయుష్షు సంపూర్ణ ఆయుష్షు గా మారుతుందని పేర్కొన్నారు. జైలుకు పంపి రాజకీయాలు మార్చాలి అనుకోవడం అవివేకమే అవుతుందన్నారు. గతంలో రాజ్యసభ చైర్మన్‌గా వెంకయ్య నాయుడు .. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు రాగానే శరద్‌ యాదవ్‌ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రఘురామ సభ్యత్వం ఇప్పటికే రద్దు జరగాల్సి ఉన్న రాజకీయ కారణాలతో జాప్యం జరిగిందని అభిప్రాయపడ్డారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *