దసపల్లా హోటల్‌ భూములు ఎవరి చేతుల్లోకి వెళ్లాయో తేలాలి

దసపల్లా హోటల్‌ భూములు ఎవరి చేతుల్లోకి వెళ్లాయో తెలాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు, నిజాయితీగల అధికారితో ఉత్తరాంధ్రలో ఇన్‌సైడర్‌ ట్రేడిరగ్‌పై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. విశాఖలో తమ ప్రభుత్వం వచ్చాక ఇన్‌సైడర్‌ ట్రేడిరగ్‌ జరిగిందని తెలిపారు. ప్రత్యేక హోదా అంశంపై సీఎం ఆదేశిస్తే రాజీనామాకు ఎంపీలందరం సిద్ధమని రఘురామ ప్రకటించారు. ‘‘నాపై అనర్హత వేటు పడదు. మీ బెయిల్‌ రద్దు చేయమని అనడం రాజద్రోహం ఎలా అవుతుంది. వాట్సాప్‌లో చాటింగ్‌ బయట పెట్టామని అంటున్నారు.. నా ఫోన్‌ పోలీసులు తీసుకున్నారు. పెగసెస్‌ సాఫ్ట్‌వేర్‌ మీరు తెప్పించారని అంటున్నారు. మీరు చాలా మందిపై వాడారని అంటున్నారు, మీరు కేంద్రం అనుమతి తీసుకున్నారా?’’ అని రఘురామ ప్రశ్నించారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడిరగ్‌ జరిగిందని ఎంతో కాలంగా నిందలు వేశారని, ఇప్పుడేమంటారని వైసీపీ నేతలను ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. బద్ధాలను ప్రచారం చేశారని, దాని వల్ల 150 మందికి పైగా రైతులు మృతి చెందారని తెలిపారు. వారి చావులకు ప్రభుత్వమే బాధ్యత వహించి సీఎం జగన్‌ ఓదార్చాలని కోరారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *