వ్యభిచారానికీ దీనికీ ఏమైనా తేడా ఉందా ?


‘‘పోర్న్‌ వర్సెస్‌ వ్యభిచారం. కెమెరా ముందు శృంగారం చేసినందుకు డబ్బులు చెల్లించడాన్ని ఎందుకు చట్టబద్థం చేయకూడదు. వ్యభిచారానికీ దీనికీ ఏమైనా తేడా ఉందా’’ అని ప్రశ్నిస్తూ బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రా తన ట్విటర్‌ వేదికగా ట్వీట్‌ చేయడం అప్పట్లో కాస్త వివాదం అయింది. మార్చి 29, 2012న రాజ్‌ కుంద్రా తన ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ వైరల్‌ కావడంతో నెటిజన్లు రాజ్‌కుంద్రాపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అశ్లీల చిత్రాలను తీసి పలు యాప్‌ల ద్వారా విడుదల చేస్తున్నారన్న ఆరోపణలతో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే! ఇదే విషయంపై ఫిబ్రవరిలో ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు రాజ్‌ కుంద్రాపై కేసు నమోదు చేశారు. తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని, ఈ కేసులో ప్రధానంగా రాజ్‌కుంద్రా నిందితుడిగా కనిపిస్తున్నాడనీ ముంబై కమిషనర్‌ వెల్లడిరచారు. మరిన్ని వివరాలు సేకరించడానికిగానూ ఈ నెల 23న వరకూ రాజ్‌కుంద్రాను తమ కస్టడీలోనే ఉంచనున్నట్లు పోలీసులు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *