ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వెనక్కి తగ్గకుండా ‘కాపు నేస్తం’ సాయం

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వెనక్కి తగ్గకుండా ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద మహిళలకు రూ.490.86 కోట్ల ఆర్థిక సాయాన్ని గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా లబ్ధిదారుల ఖతాల్లో డబ్బు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. కాపుల్లో నిరుపేదల ఉన్న వారికి ‘వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం’ అందిస్తున్నామని, కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల మహిళలకు ఆర్ధిక సాయం చేస్తున్నామని తెలిపారు. అర్హులైన కాపు మహిళలకు ఏటా రూ.15 వేలు ఆర్ధిక సాయం, ఐదేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ పథకాన్ని అమలు చేసింది. అందులో భాగంగా ఈ మొత్తాన్ని బ్యాంకులు పాత అప్పుల కింద జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాల్లో నగదు జమ చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *