ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలల ప్రారంభం

ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునఃప్రారంభం చేయాలని.. అప్పుడే మొదటి విడత నాడు-నేడు పనులను ప్రజలకు అంకితం చేయాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. పాఠశాలలు పునఃప్రారంభించిననాడే రెండో విడత నాడు-నేడు పనులకు శ్రీకారం చుట్టడమే కాక.. నూతన విద్యా విధానం గురించి ప్రభుత్వం సమగ్రంగా వివరిస్తుందని సీఎం జగన్‌ తెలిపారు. విద్యాశాఖకు సంబంధించిన నాడు-నేడు కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష చేపట్టారు. పాఠశాలలు తిరిగి ప్రారంభించిన నాడే విద్యార్థులకు విద్యా కానుక కిట్టులు కూడా అందజేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్‌, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *