చదువే..పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి

 

చదువే..పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలిపారు. జగనన్న విద్యా దీవెన రెండో విడత సొమ్మును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. దాదాపు 10.97 లక్షల మంది విద్యార్థులకు రూ.693.81 కోట్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ బాగా చదువుకోవాలనేది నా తాపత్రాయం. ఇందులో భాగంగానే జగనన్న విద్యా దీవెన అనే మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తల్లిదండ్రులకు భారం లేకుండా విద్యాదీవెన అమలు చేస్తున్నాం. దేవుడి ఆశీస్సులతోనే ఇదంతా చేయగల్గుతున్నాం. ప్రతి పేద విద్యార్థికి చదువు అందుబాటులోకి రావాలన్నదే మా ప్రభుత్వం లక్ష్యం. అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థుల భవిష్యత్తు కోసం 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నాం’ అన్నారు. ప్రతి అడుగులోను విద్యార్థుల భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దగ్గర 33శాతం నిరక్షరాస్యత ఉంది. బ్రిక్స్‌ దేశాలతో పోలిస్తే మన దేశంలో.. ఇంటర్‌ తర్వాత డ్రాప్‌ అవుట్స్‌ సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితిని మార్చడం కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టాం. తల్లిదండ్రులకు భారం లేకుండా వసతి దీవెన అందిస్తున్నాం. ప్రతి మూడు నెలలకోసారి తల్లుల ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తున్నాం. తల్లులే నేరుగా ఫీజులు చెల్లించేలా చర్యలు తీసుకున్నాం. విద్యా దీవెనతో ఇప్పటివరకు రూ.5,573 కోట్లు అందించాం. అమ్మఒడి, విద్యాకానుక, మనబడి నాడు-నేడు కింద..మొత్తం రూ.26,677 కోట్లు ఖర్చు చేశాం’’ అని సీఎం జగన్‌ తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *