డెల్లా ప్లస్‌పై కొవాగ్జిన్‌ మెరుగైన పని తీరు

 

కొవాగ్జిన్‌కు అత్యవసర వినియోగం కోసం భారత్‌, బ్రెజిల్‌, ఫిలిప్పీన్స్‌, ఇరాన్‌, మెక్సికో సహా 16 దేశాలు ఆమోదం తెలిపాయి. మరో 50 దేశాల్లో ఆమోదం ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. భారత్‌లో ఇప్పటి వరకూ 43 కోట్లకుపైగా డోస్‌ల పంపిణీ జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భారత్‌లో కొనసాగుతోంది. జులై చివరి నాటికి దేశంలో 516 మిలియన్‌ డోస్‌లు అందుబాటులోకి వచ్చాయి. డిసెంబరు నాటికి 100 కోట్ల మందికి టీకాలను వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ డెల్టా ప్లస్‌ వేరియంట్‌పై సమర్థంగా పనిచేస్తున్నట్టు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. దేశంలో కోవిడ్‌ ఉద్ధృతి, వ్యాక్సిన్ల పనితీరుపై సీఎంఆర్‌ ఓ అధ్యయనం చేపట్టింది. భారత్‌లో కరోనా రెండో దశ వ్యాప్తికి కారణంగా భావిస్తోన్న డెల్టా వేరియంట్‌ నుంచి కొవాగ్జిన్‌ టీకా మెరుగైన రక్షణ కల్పిస్తోంది… దీంతో పాటు డెల్టా ప్లస్‌ వేరియంట్‌ను కూడా ఈ వ్యాక్సిన్‌ సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు అధ్యయనంలో తేలిందని ఐసీఎంఆర్‌ తెలిపింది. కోవిడ్‌-19పై పోరులో భాగంగా ఐసీఎంఆర్‌, పుణేలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) సహకారంతో భారత్‌ బయోటెక్‌ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఈ టీకా సమర్ధత 77.8 శాతంగా ఉన్నట్లు ఇటీవల మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ తుది విశ్లేషణలో నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ టీకా.. డెల్టా వేరియంట్‌ నుంచి 65.2 శాతం, కొవిడ్‌-19 తీవ్రతను 93.4 శాతం మేరకు నిరోధి స్తుందని, లక్షణాలు బయటపడని (అసింప్టమాటిక్‌) వారికి సైతం 63.6 శాతం మేర రక్షణ ఉంటుందని వెల్లడయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *