హైకోర్టును ఆశ్రయించిన ఊర్మిళ గజపతిరాజు

 

మాన్సాస్‌ ట్రస్టు చైర్మన్‌ విషయంలో సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై ఆనంద గజపతిరాజు రెండో భార్య కుమార్తె ఊర్మిళ అప్పీల్‌ చేశారు. అశోక్‌ గజపతిరాజును చైర్మన్‌గా కొనసాగిస్తూ ఇటీవల సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు ఇవ్వడం తెలిసిందే. మాన్సాస్‌ ట్రస్టు చైర్మన్‌గా తనను నియమించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె తన న్యాయవాది ద్వారా కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఊర్మిళ మాన్సాస్‌ ట్రస్టుకు వారసురాలేనని ఆమె తరఫు న్యాయవాది విచారణ సందర్భంగా హైకోర్టుకు తెలిపారు. మాన్సాస్‌ ట్రస్టు వ్యవహారంలో త్రిముఖ పోరు నెలకొన్నట్టు కనిపిస్తోంది. మాన్సాస్‌ ట్రస్టుపై ఆధిపత్యం కోసం అశోక్‌ గజపతిరాజు, ఆనంద గజపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచయిత హోరాహోరీ పోరాటం చేయడం తెలిసిందే. ఈ క్రమంలో, ఊర్మిళ గజపతిరాజు మాన్సాస్‌ ట్రస్టు అంశంలో హైకోర్టును ఆశ్రయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *