అరెస్ట్‌ అయిన వారందరూ గెలుస్తారు

 

అరెస్ట్‌ అయిన వారందరు ఎన్నికల్లో నెగ్గుతారని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తెలిపారు. జగన్‌ అరెస్ట్‌ కాకపోతే సీఎం అయ్యేవాళ్లు కాదని ఉండవల్లి పేర్కొన్నారు. చంద్రబాబును అరెస్ట్‌ చేస్తారని తాను అనుకోవడం లేదన్నారు అరుణ్‌ కుమార్‌. చంద్రబాబుపై పెట్టిన కేసులు ఏవీ నిలబడలేదని.. ఆయన మీదు కేసులు ఉన్నాయంటారు.. కానీ ఏవీ లేవన్నారు. ఓటుకు నోటు కేసు ఏదో ఒకటి ఉన్నట్లుంది.. ఒక మనిషిని అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టడమంటే హీరోను చేయడమే అన్నారు. టీడీపీ నేతల్ని ఎందుకు అరెస్ట్‌ చేయిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *