పోలీసు వ్యవస్థ గాడి తప్పింది

కొన్ని కారణాల వల్ల పోలీసు వ్యవస్థ గాడి తప్పిందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. పోలీసు వ్యవస్థకు ఈ గతి ఎందుకు పట్టింది ? పేరు ప్రఖ్యాతులు పొందిన పోలీసులు నేడు మసకబారిపోవడానికి మొదట జగన్‌, ఆ తర్వాత గౌతమ్‌ సవాంగ్‌ లే కారణం’’ అని వర్ల రామయ్య ఆరోపించారు. జగన్‌ సీఎం అయ్యాక, గౌతమ్‌ సవాంగ్‌ డీజీపీగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర పోలీసు ప్రతిష్ఠ మసకబారుతోందని అన్నారు. ఏదైతేనేమి, ఏ ప్రాంతంలో గాడితప్పిందో చెప్పేందుకు చాలా ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. సాక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *