భర్తకు శిల్పాశెట్టి విడాకులు

అశ్లీల చిత్రాలను నిర్మిస్తూ యాప్‌లో విడుదల చేస్తున్నారన్న ఆరోపణలపై గత నెల 19న ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు రాజ్‌కుంద్రాను అరెస్టు చేశారు. సాక్ష్యాలు కూడా అతడికి వ్యతిరేకంగా ఉండటంతో జైలుకు కూడా వెళ్లాడు. జూడిషియల్‌ కస్టడీలో ఉన్న అతడు ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు. భర్త అశ్లీల చిత్రాల వ్యవహరం తెలియగానే శిల్పా షాక్‌కు గురయ్యిందని, ఈ విషయం అప్పటి వరకు తనకు తెలియదని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. దీంతో శిల్పా భర్తతో విడిపోవాలనుకుంటుందని, తన పిల్లలతో కలిసి వేరుగా ఉండేందుకు ఆమె ప్లాన్‌ చేసుకుంటున్నట్లు బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేగాక ఇంతకాలం సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన శిల్పా ఇకపై నటించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శిల్పాకు ఆమె భర్తకు మధ్య ఉండే గొడవలు తక్కువేం కాదని, వారి మధ్య ఇంతకు ముందు కూడా తరచూ ఏవొక సమస్యలు వస్తూనే ఉండేవని రాజ్‌కుంద్రా అరెస్టు అనంతరం ఆమె సన్నిహితులు పేర్కొన్నారు. దీంతో ‘శిల్పా తన భర్తతో విడిపోవడం ఖాయమే’ అంటూ నెటిజన్లు, పరిశ్రమలోని కొందరూ అభిప్రాయపడుతున్నారు. శిల్పా శెట్టి తన భర్త రాజ్‌కుంద్రాకు విడాకులు ఇచ్చేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. రాజ్‌కుంద్రాతో విడిపోయి తన పిల్లలతో కలిసి జీవించాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *