బుర్ఖా ధరించలేదని కాల్చివేత

ఆరు నెలల గర్భిణి అయిన ఓ మహిళా పోలీసును తాలిబన్లు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. బుర్ఖా వేసుకోలేదనే కారణంతో ఆమెను తాలిబన్లు చంపేయడం గమనార్హం. ఈ విషాదకర సంఘటన ఆమె భర్త, పిల్లలు, కుటుంబసభ్యుల ముందే జరిగింది. గర్భిణి అని కూడా చూడకుండా సదరు మహిళను అత్యంత కిరాతకంగా చంపేయడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. తాము మారామని తాలిబన్లు చెపుతున్నప్పటికీ… వారు చేస్తున్న కిరాతకాల వల్ల వారు మారారని ఎవరూ నమ్మేలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మహిళలపై వారు చేస్తున్న దురాగతాలు అత్యంత దారుణంగా ఉంటున్నాయి. గతంలో తాలిబన్లు పాలన కొనసాగించిన ప్పుడు మహిళలపై దారుణమైన ఆంక్షలు విధించారు. ముఖం దగ్గర నుంచి పాదాల వరకు ఏ శరీర భాగం కనపడకుండా మహిళలు బుర్ఖాలు ధరించేవారు. అయితే, గత రెండు దశాబ్దాలుగా వారు పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ తాలిబన్ల పాలన రావడంతో పాత పరిస్థితులు మళ్లీ మొదలయ్యాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *