మౌనంగా ఉంటున్నాం కాబట్టే టీడీపీ వాళ్లు రెచ్చిపోతున్నారు

 

మనం మౌనంగా ఉంటున్నాం కాబట్టే టీడీపీ వాళ్లు రెచ్చిపోతున్నారు అని ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. ఆయన శనివారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధరలు పెరిగాయంటూ మాపై ఏడవడం ఎందుకు? జంటగా ఇంట్లో ఉంటున్నారు కదా… వెళ్లి కేంద్రాన్ని అడగండి’’ అంటూ టీడీపీ నేతలను ఎద్దేవా చేశారు. మీది దేవతల పాలనా… వెయ్యికి పైగా హామీలు ఇచ్చి ఏనాడైనా నెరవేర్చారా… వంచక పాలకులుగా మిగిలిపోయారు అని టీడీపీ అధినాయకత్వంపై ధ్వజమెత్తారు. వైసీపీ కార్యకర్తలు మౌనం వీడాలని పిలుపునిచ్చారు. ‘సీఎం జగన్‌ కు మనం మద్దతు ఇవ్వకపోతే టీడీపీ మరింత పేట్రేగిపోతుంది, మనం ఇంకా బలహీనులం అవుతాం’ అని వివరించారు. టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు బదులివ్వడానికి వైసీపీలో ఓ సామాన్య కార్యకర్త చాలని అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *