నల్లమల అడవిలో భారీగా డబ్బులు స్వాధీనం !

మహానంది మండలంలోని నల్లమల అడవిలో అక్రమంగా తరలిస్తున్న 150 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ. 22 లక్షల డబ్బుతో పాటు మూడు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకొని కడప పట్టణానికి చెందిన కాలమల్ల నాగూర్‌బాషా, అదే జిల్లా ఎర్రబల్లి ఉప్పుగుంటుపల్లెకు చెందిన అడిబోయిన లక్ష్మీనారాయణను నిందితులను అరెస్టు చేశారు. కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగలు, డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *