సీఎం జగన్‌ మద్యం, మాంసం, చేపలు అమ్ముతారా ?

సీఎం జగన్‌ మద్యం, మాంసం, చేపలు అమ్ముతారా ? అని ప్రశ్నించారు టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు. లేని దిశ చట్టంతో శిక్షలు వేశామని హోంమంత్రి సుచరిత గొప్పలు చెబుతున్నారని, తక్షణమే హోం మంత్రి రాజీనామా చేయాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్‌ చేశారు. చేతకానివారు పాలన చేస్తే ఇలానే ఉంటుందని ఎద్దేవాచేశారు. సన్న బియ్యం అంటే తెలియనివారు పౌర సరఫరాల మంత్రి అని తప్పుబట్టారు. బెట్టింగ్‌ రాయుడు ఇరిగేషన్‌ మంత్రి అయ్యరని దుయ్యబట్టారు. ఏపీని అసమర్థ సీఎం పాలిస్తున్నారని అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *