దక్షిణాది రాష్ట్రాల సినిమా సంబంధాలు

ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అన్ని రంగాలలోనూ తెలుగు వారు ఎలా ముందుకు దూసుకుపోయారో ఆదర్శంగా కృషి చేశారో అలాగే నాటక సినిమా రంగాలలో కూడా కృషి చేశారు. ఆనాటి మన తెలుగు నాటకాలను, నటీనటుల సామర్ధ్యాన్ని ఎంతగానో ప్రశంసిస్తూ వుండేవారు. అలాగే మన చలనచిత్రకళ దక్షిణాది రాష్ట్రాల వారికి ఆదర్శప్రాయంగా ఉండేది. ఆ రకంగా ఆనాడు తెలుగువారు జాతీయ సమైక్యతకు ఎంత కృషి చేశారో అర్ధం చేసుకోవచ్చును. ముఖ్యంగా తెలుగు చిత్రాలు ఉన్నత ప్రమాణంలో వుండి తమిళ, కన్నడ, మళయాళ ప్రజల ప్రశంసలందుకుంటూ వుండేవి. ఆంధ్రదేశంలో విజయవంతతమైన ప్రతి తెలుగు చిత్రమూ మద్రాసు నగరంలో నూరు రోజులకు తక్కువ నడిచేది కాదు.

అలాగే దక్షిణాది భాషా రాష్ట్రాల ముఖ్య పట్టణాలలో కూడా నూరు రోజులు నడిచిన తెలుగు చిత్రాలున్నారు. భాష తెలియకపోరునా తెలుగు చిత్రాల్ని అంతగా ఆదరించేవారు. వారి సొంత భాషా చిత్రంగా అభిమానించేవారు. మన చిత్రంలోని అభ్యుదయ దృక్పధాన్ని ఎంతో ఆదర్శంగా తీసుకునేవారు. తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ ప్రజల మధ్య ఏ రకమైన భాషాద్వేషాలు వుండేవి కావు. అందరిదీ జాతీయ దృక్పథం. అలా మన తెలుగు చిత్రకళ ఇతర భాషల ప్రజలకు నూతనోత్తేజాన్ని కలిగించింది. సుప్రసిద్ధ తమిళ చిత్ర నిర్మాతలు తెలుగు సినిమా అభివృద్ధికి ఎంతో సేవ చేశారు. వారిని కృతజ్ఞతా పూర్వకంగా స్మరించుకోడం మన ధర్మం. జెమినీ పిక్చర్సు, యస్‌.యస్‌. వాసన్‌, యస్‌.యస్‌.

బాలన్‌, సేలం మోడరన్‌ ధియేటర్స్‌ సుందరం, మెయ్యప్ప చెట్టియారు, ఎ.వి.యం., వాసూ, మీనన్‌, ఏ.యల్‌. శ్రీనివాసన్‌, జూపిటర్సు పిక్చర్సు, సోము, పక్షిరాజు శ్రీరాములునాయుడు, బి.ఆర్‌. పంతులు, కె.యం. నాగన్న, బి.యస్‌. రంగా -వీనస్‌ పిక్చర్సు, అశోకా మూవీస్‌ – శ్రీధర్‌, గౌండప్ప చెట్టియార్‌, విఠలాచార్య, కె. సుబ్రహ్మణ్యం, ఆర్‌.యం. కృష్ణస్వామి, రామన్న ఎ.కె. వేలన్‌, సౌందరరాజన్‌ మొదలరున అనేక మంది ప్రసిద్ధ అన్యభాషా చిత్ర నిర్మాతలు ఎన్నో తెలుగు చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించి తెలుగువారి చలన చిత్ర రంగానికి అకుంఠిత సేవలను అందించారు. తెలుగు సినిమా రంగం వారికి ఎంతో రుణపడి వుంది.

అలాగే తెలుగు సినిమా దర్శకులైన ప్రముఖులు వై.వి.రావు, కడారు నాగభూషణం, హెచ్‌.యం.రెడ్డి, శ్రీరాములు నాయుడు, చాణక్య, బి.యస్‌. నారాయణ, ఆదుర్తి సుబ్బారావు, బి.ఎ. సుబ్బారావు, చిత్రపు నారాయణమూర్తి , పి. పుల్లయ్య, భీమసింగు, పి. భానుమతి మొదలైనవారు తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగు సినీ గాయనీ గాయకులైన పి. భానుమతి, యస్‌. వరలక్ష్మి, జిక్కి, సుశీల, జానకి, కోకా జమునారాణి, వసంత, ఘంటసాల, పి.బి. శ్రీనివాస్‌, యస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది సత్యం, ఎ.యం.రాజా మొదలైనవారు తమిళ, కన్నడ, మళయాళ చిత్రాలలో ఎన్నో పాటలు పాడారు. వారి ఆదరాభిమానాలు పొందారు.

తెలుగు సినిమా రంగంలో ప్రసిద్ధ నటీ నటులుగా వర్ధిల్లిన అనేక మంది నటీమణులు తమిళ చిత్రాల్లో కూడా బహుముఖ పాత్రలు ధరించారు. అలా ధరించిన వారిలో పద్మశ్రీ, భానుమతి, కన్నాంబ, పి. శాంతకుమారి, షావుకారుజానకి, యస్‌.వరలక్ష్మి, అంజలీదేవి, దేవిక, జమున, జయంతి, వాణిశ్రీ, సావిత్రి గణేశన్‌, కాంచన, రాజసులోచన, శారద, జయశ్రీ(అమ్మాజి), విజయనిర్మల, ఋష్యేంద్ర మణి, జి. వరలక్ష్మి, మాలతి, విజయలలిత, జయచిత్ర, జయసుధ, యస్వీరంగారావు, పద్మశ్రీ నాగయ్య మొదలైనవారు తమిళ చలనచిత్ర రంగాన్ని అలరించారు. తెలుగు కన్నడ చలనచిత్రాలలో ప్రారంభం నుంచీ అనేక విధాల పరస్పర సంబంధాలు పెరిగారు.

భారతదేశంలో టాకీలు ప్రారంభ దశలో వున్నపుడు చిత్రాలు ఎక్కువగా లేవు. సంవత్సరానికి ఒకటో రెండో చిత్రాలు మాత్రమే తయారయ్యేవి. అలా కన్నడంలో మొట్టమొదటి సారిగా తెరపై ప్రదర్శించిన చిత్రం సతీ సులోచన. దానికి దర్శకత్వం వహించినవారు తెలుగువారైన వై.వి.రావుగారు. ఆ చిత్రంలో పాల్గొన్న వారందరూ కన్నడ నటులే అరునా ఈ ప్రథమ కన్నడ చిత్రంలో వైవి.రావుగారు దర్శకత్వంతోబాటు లక్ష్మణుని పాత్రను సైతం అద్వితీయంగా పోషించారు. అంతకు ముందు కన్నడ రాష్ట్రంలో విజయభేరీ మ్రోగించిన తెలుగు చిత్రం సతీ సావిత్రి. దానిలో పాల్గొన్న రామతిలకం, వేమూరు గగ్గయ్య, పారుపల్లి సత్యనారాయణ మొదలైన నటులు తెలుగువారు. వారి సంగీతం కన్నడ ప్రజలను ఎంతగానో ఆకర్షించింది.

1932లో బొంబారు ఇంపీరియల్‌ ఫిలిం కంపెనీలో తయారుచేసిన భక్త రామదాసు తెలుగు చిత్రంలో రామదాసు పాత్రాభినయం చేసినవారు కన్నడులైన ఆర్‌. నాగేంద్రరావుగారు. వీరిని ఉత్తేజపర్చింది బళ్ళారి రాఘవాచార్య నటన. బెంగుళూరులో అమెచ్యూర్‌ డ్రమెటిక్‌ వారు ప్రదర్శించిన అనేక తెలుగు నాటకాలలో తెలుగు, కన్నడ నటులు కలిసి నటిస్తూ వుండేవారు. బళ్ళారి రాఘవాచారిగారు ఈ సమాజంలో ప్రదర్శించిన రామదాసు పాత్రను చూచే ఆర్‌. నాగేంద్రరావుగారు ప్రభావితులైనారు. అదే రామదాసు పాత్రను బెంగుళూరు వాస్తవ్యులు కన్నడ రాఘవాచారి గారు తెలుగులో అద్వితీయంగా నటించి ప్రజాదరణ పొందారు. సి.కె. వెంకటప్పయ్య రచించిన కన్నడ నాటకం, మండోదరిలో ఆంధ్రులైన బళ్ళారి రాఘవ, శ్రీమతి సరోజిని, రావణ, మండోదరి పాత్రలందు నటించి ఖ్యాతిని ఆర్జించారు.

తెలుగు నటీనటులైన సరోజని, కొమ్మూరి పద్మావతి, విశ్వేశ్వరమ్మ, రాఘవాచారి, కన్నడ నటీనటులైన వెంకట సుబ్బయ్య, దేవుడు నరసింహ శాస్త్రి, బి.యస్‌.గురూడ్‌, గరిమాజీ వాసుదేవరావు, మోటకాపల్లి సుబ్రహ్మణ్య శాస్తి, సి.కె. నాగరాజారావు, యం.యల్‌. శ్రీనివాస శాస్త్రి, రంగస్వామి మొదలైన వారు కలిసి కన్నడ, తెలుగు నాటకాలలో పాత్రలు ధరించేవారు. బి.యస్‌. గరూడ్‌ ఆనాడు నిర్మించిన చెంచులక్ష్మి చిత్రంలో నారద పాత్రను అద్భుతంగా అభినరుంచాడు. అదే విధంగా తెలుగు ద్రౌపదీ మాన సంరక్షణంలో కన్నడ నటులైన రంగస్వామి శకుని పాత్రను సమర్ధవంతంగా పోషించారు. మద్రాసు ప్రగతి పిక్చర్సువారు భూకైలాస అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రంలో నటించినవారు కన్నుడలైన ఆర్‌.నాగేంద్రరావు, సుబ్బయ్య నాయుడు, శ్రీమతి లక్ష్మీబారు, శ్రీమతి కమలాబారు మొదలైనవారు.

నిర్మాతలు – తమిళులు, నటులు – కన్నడులు, దర్శకుడు – మరాఠీవారు. ఈ తెలుగు చిత్రం ఆంధ్ర దేశంలో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. అదే విధంగా కన్నడ చిత్రాల్లో తెలుగు నటీనటులైన చిత్తూరు వి. నాగయ్య, షావుకారు జానకి, కృష్ణకుమారి, సూర్యకళ, కాంచన, హేమచౌదరి, జయంతి, భానుమతి, రమాదేవి, ఆదోని లక్ష్మి మొదలైన వారంతా నటించారు. అలాగే శ్రీయుతులు నాగేంద్రరావు, సుబ్బయ్యనాయుడు, రంగస్వామి, గరూడ్‌ హోన్నప్ప భాగవతార్‌, బి. జయమ్మ, యం.వి. రాజమ్మ, బి. సరోజాదేవి, భారతి, సంధ్య, చంద్రకళ, పండరీబారు, పద్మాదేవి, మిత్రవింద మొదలైన నటీనటులు తెలుగు చలన చిత్రాల్లో నటించి కీర్తి ఉత్తమ గాయకులైన హన్నప్ప భగవతార్‌, గరూడ్‌, అశ్వత్థమ్మ కన్నడం, తెలుగే గాక అన్యభాషా చిత్రాల్లోనూ నటించి వారి గాన మాధుర్యంతో మనలను మెప్పించారు.

అలాగే తెలుగు వారైన ఘంటసాల పి.బి. శ్రీనివాస, యస్‌. జానకి కన్నడ తెరపై కూడా నేపధ్య గాయకులుగా ప్రసిద్ధి చెందారు. తెలుగు సంగీత దర్శకులైన తాతినేని చలపతిరావు, వెంకటరాజు, కన్నవీణ రంగారావు బలమురళి కన్నడ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. అలాగే కన్నడులైన జి.కె. వెంకటేష్‌, రాజన్‌ నాగేంద్ర, విజయభాస్కర్‌ మొదలైనవారు తెలుగు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. నాగేంద్రరావు, బి.ఆర్‌. పంతులు, బి.యస్‌ రంగా, విఠలాచార్య, కె.యం నాగన్న మొదలైన కన్నడ నిర్మాతలు తెలుగు చిత్రాలను నిర్మించి వాటికి దర్శకత్వం వహించారు. 1935 నుంచి కన్నడ చలనచిత్ర రంగంలో పనిచేస్తున్న సి.కె. నాగరాజరావుగారు జానకిని, కృష్ణకుమారిని కన్నడ చలనచిత్ర రంగానికి పరిచయం చేశారు. ఈ విధంగా తెలుగువారి చలనచిత్ర కళ తెలుగు, తమిళ, కన్నడ భాషల పరస్పర సంబంధంతో వెలుగొందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *