విద్యాశ్రీ పధకానికి మావూరి వెంకటరమణ రూ.3 లక్షల వితరణ

విశాఖపట్నం, అక్టోబబర్ 4 (న్యూస్‌టైమ్): జివియంసి పాఠశాలల్లో విద్యనభ్యశిస్తూ, యస్‌.యస్‌.సి (పదవతరగతి) లో ఉత్తమర్యాంకు సాధించిన వారికి కార్పొరేట్‌ విద్యాసంస్దల్లో విద్యనభ్యశించడానికి అవకాశం కల్పిస్తున్న విద్యాశ్రీ పథకంగా కమిషనర్‌ హరినారాయణన్‌ పేర్కొన్నారు. విద్యాశ్రీ పథకానికి యం.వి.ఆర్‌ మాల్‌ఆధినేత మావూరి వెంకటరమణ మంగళవారం రూ.3 లక్షలను చెక్కు రూపంలో ఆందజేశారు. ఇదేవిధంగా విద్యాశ్రీ పథకానికి మరింత ప్రోత్సహించడానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బాల్యం ప్రాజెక్టు ఆఫీసర్‌ యస్‌.టి.వి.రత్నకుమార్‌ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *