విశాఖ వ్యాలీలో ఘనంగా ఐరాస దినోత్సవం

విశాఖపట్నం, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): విశాఖ వ్యాలీ పాఠశాల్లో ఐక్యరాజ్యదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానాచార్యులు డాక్టర్‌ ఎన్‌ వల్లీస్‌నాథ్‌ తన స్వాగతోపన్యాసం చేస్తూ దక్షిణబారతదేశంలోనే ప్రపధంగా సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ ల్యాబ్‌ని ప్రారంభించామన్నారు. ఐక్యరాజ్య అనుబంధంతో ఎస్‌వుయుకెన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు స్టిఫెన్‌ అనురాగ్‌ ఆశయాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కోన్నారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిధిగా హాజరైన హైదరాబాద్‌లోని యుకె డిప్యూటీ హై కమిషన్‌ రీజనల్‌ ఆడ్వయిజర్‌ ఎం. సుబ్బులక్ష్మి మాట్లాడుతూ అభివృద్దికి ప్రతీకలుగా ఇటువంటి కార్యక్రమాలు నిలుస్తాయిని చెప్పారు.

విద్యార్థుల్లో ఐక్యతాభావాలు పెంపోందించే ఇటువంటి కార్యకమాలు ఎన్నో జరగాలన్నారు. కార్యక్రమంలో 250 మంది విద్యార్థులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా వ్యాసరచన , చిత్రలేఖనం, ప్రజ్ఞకు ప్రతీకలైన నమోనాలను ప్రదర్శింపచేశారు. పూర్వ విద్యార్థి త్రిభువన్‌ తేజ్‌ ఆధ్వర్యంలో ఎస్‌వుయుకెన్‌ సభ్యులతో కలిసి పాఠశాల ప్రాంగణంలో ప్రధానచార్యులు మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఉప ప్రధానచార్యులు కల్పనాపాత్రో, జి. రాధ, ఉపాధ్యాయులు జె అరుణ, వెన్నెలతో పాటు విద్యార్థులు ఉత్సాహాంగా పాల్గోన్నారు.

ప్రైవేట్ రంగంలో దళితులకు రిజర్వేషన్లు అవసరం
విశాఖపట్నం, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): ఆంధ్రాయూనివర్సిటీ సామాజిక హక్కుల వేదికతో కలిసి ఎస్సీ, ఎస్టీ, బి.సి., మైనారిటీస్‌ ఫారమ్‌ నిర్వహించిన ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బి.సి. మైనారిటీలకు రిజర్వేషన్స్‌ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రాయూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ, బి.సి. సి ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు డాక్టర్ టి. షారోన్‌ రాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా షారోన్‌ రాజు మాట్లాడుతూ కేరద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహుజనులు, మైనారిటీలపై చూపుతున్న నిర్లక్ష్య ధోరణి సరియైనది కాదని, మా గాలి, నీరు, భూమి, శ్రమతో నడుపుతున్న ప్రైవేటు సంస్థలలో మాకు రిజర్వేషన్స్‌ ఉండటం అనేది భారత రాజ్యాంగం కల్పిరచిన హక్కు అని తెలియజేశారు. దీని ద్వారా మాత్రమే సామాజిక న్యాయం అనేది సాధించడం జరుగుతుందని, ఎస్సీ, ఎస్టీ, బి.సి. మైనారిటీలు సంఘటితంగా ఉండి పోరాడి సాధించుకోవాలని కోరారు. సి.పి.ఐ. రాష్ట్ర కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి (నాని) మాట్లాడుతూ ప్రభుత్వం రిజర్వేషన్లకు విఘాతం కలిగించేలా ప్రణాళికలు రచిస్తున్నారని, ఇలాంటి ప్రమాద పూరిత విదానాలను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని సూచించారు. అర్టికల్‌ 348 (3)ని ఆధారంగా చేసుకొని ప్రైవేటు రంగ సంస్థలలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఆంధ్రాయూనివర్సిటీ ఆచార్యులు వేణు దేవరా, రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ చట్టాల్ని సరియైన రీతులో ఉపయోగించడం, ఐక్యమత్యంగా, ప్రణాళికబద్ధంగా ఉండడం ద్వారా రాజ్యాంగాన్ని సరైన రీతిలో వినియోగించాలని కోరారు. మైనార్టీ నాయకులు షాధిక్‌ మాట్లాడుతూ మైనార్టీలకు సంబంధించిన అనేక కమిటీ రిపోర్టులను అమలు చేయడం జరగడం లేదని, వాటిని అమలు చేయడం ద్వారా మాత్రమే సామాజిక న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్‌ దళిత హక్కుల పోరాట సమితి ప్రతినిధులు డాక్టర్ నాగరాజు, డాక్టర్ శ్రీనివాస్‌, ప్రియాంక, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొని తమతమ భావాలు తెలియజేశారు.

ఈఎన్‌సీతో ఏయూ సంయుక్త విద్యా కార్యక్రమాలు
విశాఖపట్నం, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయంతో ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ సంయుక్తంగా పలు విద్యాసంబంధ కోర్సులను నిర్వహించనుంది. దీనికి సంబంధించిన సమావేశం ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏయూ దూరవిద్య కేంద్రం నిర్వహిస్తున్న కోర్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వార్షిక, రిఫ్రెషర్‌ కోర్సులను ఈఎన్‌సి సిబ్బందికి ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈఎన్‌సిలో ఏయూ దూరవిద్య కేంద్రం స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. బిటెక్‌, ఎంటెక్‌ సమీకృత కోర్సులో ఈఎన్‌సి సిబ్బంది పిల్లకు ప్రత్యేకప్రవేశం కల్పిస్తామన్నారు. ఎంబిఏ సెల్ప్‌ ఫైనాన్స్‌ కోర్సుల్లో, ఎంటెక్‌ ఈవెనింగ్‌ కోర్సులో ఈఎన్‌సి సిబ్బందికి ప్రవేశం కల్పిస్తామన్నారు. సంయుక్త విద్యా కార్యక్రమాల రూపకల్పను ఈఎన్‌సి చూసిన చొరవను వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అభినందించారు. వర్సిటీని అవసరమైన సహకారాన్ని పూర్తిస్థాయిలో అందించడం జరుగుతుందన్నారు. త్వరలో దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందం చేసుకోవాలని సూచించారు. కమోడోర్‌ అమిత్‌ విక్రమ్‌ మాట్లాడుతూ ఈఎన్‌సిలో పనిచేసే సెయిలర్స్‌, అధికారులకు ఈ కోర్సులు ఎంతో ఉపకరిస్తాయన్నారు. వ్యక్తిగత విద్యా ప్రగతికి ఇటువంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో కలసి తమ ఉద్యోగుల విద్యోన్నతికి పాటు పడాలన్నారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య పి.ఎస్‌ అవధాని, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఆచార్య ఎం.ఎస్‌.పి బాబు, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు, ఎడ్యుకేషన్‌ కల్సల్టెంట్‌ ఉజ్వల్‌ కుమార్‌ ప్రసంగించారు. అనంతరం విభాగాధిపతులు, బిఓఎస్‌ చైర్మన్లు తమ ఆలోచనలను పంచుకున్నారు. అనంతరం ఇఎన్‌సి అధికారులకు ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు జ్ఞాపికను బహూకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *