నాతవరంలో జర్నలిస్టుపై హత్యాయత్నం

11340005

విశాఖ జిల్లా వ్యాప్తంగా నిరసనలు

జిల్లా ఎస్పీని కలిసిన ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు

నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు : ఎస్పీ

(ఫీచర్స్‌ ఇండియా.. విశాఖపట్నం)

విశాఖ జిల్లా నాతవరంలో జర్నలిస్టు ఎడీ బాబుపై హత్యా యత్నం జరిగింది. మంగళవారం సాయంత్రం వార్తలను అందించే క్రమంలో పీసీ సెంటర్‌కు చేరుకున్న అతనిపై నలుగురు వ్యక్తులు మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. ఈ దశలో అడ్డుకున్న కంప్యూటర్‌ ఆపరేటర్‌కు కూడా గాయాలయ్యారు. దీనిపై స్థాని కులు అప్రమత్తం కావడంతో నలుగురు దుండగుల్లో ఒక వ్యక్తిని స్థానికులు గుర్తించారు. నర్సీపట్నం ప్రాంతానికి చెందిన సతీష్‌గా గుర్తించారు. ఇటీవల జర్నలిస్టు ఎడీ బాబు వరుసగా లేటరైట్‌ తవ్వ కాలపై వార్తలు రాయడంతో ఈ రకంగా దాడులకు పాల్పడినట్టు తేలింది. ఈ మేరకు మిలిగిన నిందితుల కోసం పొలీసులు గాలిస్తు న్నారు. ఈ దశలో జర్నలిస్టుపై జరిగిన దాడిపై జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఎపీయూడబ్ల్యూజె రూరల్‌ ఆధ్వర్యంలో నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద బుధ వారం ఉదయం ధర్నా చేశారు. రాష్ట్ర కమిటీ కార్యదర్శి పసుపులేటి రాము, స్వామి తదితరులు మంత్రి అయ్యన్నపాత్రుడ్ని కూడా కలిసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇలావుండగా ఏపీయూడబ్ల్యూజేె అర్బన్‌ అధ్యక్షుడు రావులవలస రామచంద్రరావు నాయకత్వంలో జర్నలిస్టులు జిల్లా ఎస్పీ రాహూల్‌ దేవ్‌ శర్మను కలిశారు. తాజా దాడిలో నిందితుల్ని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. దీనిపై ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటికే నిందితుల్ని పట్టుకునేందుకు అయిదు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నిందితులపై హత్యా యత్నం తదితర సెక్షన్లపై కేసులు నమోదు చేసినట్టు వివరించారు. ఈ దశలో జిల్లాలో జర్నలిస్టులపై దాడుల నియం త్రణ కమిటీలను వేయాలని ఎపీయూడబ్ల్యూజె కోరింది. ఎస్పీని కలిసిన వారిలో ఎపీయూడబ్ల్యూజె నగర కార్యదర్శి చంద్రమోహన్‌, మెల్లి లక్ష్మణరావు. ఎపీఎలక్ట్రానిక్‌ మీడియా అసోసియేషన్‌ కోశాధికారి వెంక జగన్నాధరావు.. తిరుపతిరావు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *