జర్నలిజాన్ని వత్తిగా భావించాలి

pressacademy1

ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ వాసుదేవ దీక్షితులు

విజయనగరం,ఫీచర్స్‌ ఇండియా : జర్నలిజాన్ని ఉద్యోగంగా కా కుండా వత్తిగా భావించాలని, అప్పుడే సమాజానికి మేలు చేయగలుగుతామని ప్రెస్‌ అకా డమీ ఛైర్మన్‌ వి.వాసుదేవ దీక్షితులు అన్నారు. స్థానిక జెడ్‌పి సమావేశ హాలులో జర్నలిస్టులతో ఆయన ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం పని చేస్తున్న వారిలో ఎక్కువ మంది జర్నలిజంపై అవగాహన ఉన్న వారేనని, కొత్తగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు పునశ్చరణ తరగతులు రెండు లేదా మూడు మండలాలకోటి ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నామన్నారు. వార్తలను నిర్భయంగా రాయలని, వక్రీకరిస్తే వార్త అపవిత్రమౌ తుందని అన్నారు. జర్నలిస్టుల్లోనూ కొందరు తప్పులు చేయడం వల్ల మొత్తం జర్నలిస్టు వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తశుద్ధితో సమాజ శ్రేయస్సుకోసం పని చేయద లచుకున్న వారే జర్నలిజం వత్తి ఎంచుకోవాలన్నారు. కలంతో రాయగలిగే జర్నలిస్టులే ఎలక్ట్రానిక్‌ మీడియాలో బాగా రానిస్తు న్నారని, రాయడం, చదవడం అలవాటు లేనివారికి జర్నలిజంలో మనుగడ అత్యంత కష్టమని వివరించారు. సమస్యలు, లోటు పాట్లును ఎత్తిచూపుతునే సమాజాభివద్ధిలో భాగస్వామ్యం కావా లని కోరారు. దీనికి ముందు అకాడమీ ఏర్పాటు, ఆవశ్యకత, నడక వివరించారు. జిల్లాతో తనకున్న అనుభవాన్ని నెమరు వేసుకు న్నారు. కార్యక్రమంలో పలు పత్రికా ప్రతినిధులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీిఎం సహా కొంతమంది అధికారులు, మంత్రులు విలేకర్లపై ఎదురుదాడి చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఛైర్మన్‌, జర్నలిస్టులకు ఎదురౌ తున్న సమస్యలను తెలుసుకునేందుకే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ల్లోనూ పర్యటిస్తున్నానని, అవసరమైతే ప్రభుత్వ దష్టికి తీసుకెళ్తా మని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రెస్‌ అకాడమీ కార్యదర్శి డి.శ్రీనివాస్‌, సమాచార పౌర సంబంధాల శాఖ జోన్‌-1 ప్రాంతీ య సంయుక్త సంచాలకులు యు.బాలగంగాధర్‌ తిలక్‌, ప్రెస్‌ అకాడమీ అధికారులు ఎం.ఎ రామచంద్రమూర్తి, నారాయణరెడ్డి, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి రమేష్‌ పాల్గొన్నారు. జిల్లాకు చెందిన ప్రింట్‌, అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులు హాజర య్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *