ప్రత్యేక హోదాపై ప్రజా బ్యాలెట్‌

pratyeka1

గాజువాక, ఫీచర్స్‌ ఇండియా : బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు అధికారం చేపట్టాక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, చట్టంలోని అంశాలను అమలుచేయడంలో పూర్తిగా విస్మరించి 5 కోట్ల ప్రజలకు అన్యాయం చేశారనీ పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణం రాజు శ్రీనివాస్‌ ఆరోపించారు.ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులూ పాత గాజువాక కూడలిలో ప్రజా బ్యాలెట్‌ నిర్వహించరు.ఈ సందర్భంగా ద్రోణంరాజు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే ఏపికి 10 ఏళ్ళు ప్రత్యేక హోదా అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందు పరిచిందని తెలిపారు. టీడీపీ ఐతే 10 సంవత్సరాలు చాలదు 15 సంవత్సరాలు హోదా ఇప్పిస్తామని నమ్మబలికి గద్దెనెక్కి ఓటుకు నోటు కేసుతో 5 కోట్ల ప్రజల హక్కు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టిన ఘనుడు చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈరోజు ప్రత్యేక ప్యాకేజ్‌ ఎంతో లాభాలున్నాయని ప్రజలను తప్పుదోవ పట్టి స్తున్నారన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన మూల్యం చెలించక తప్పదని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు బెహరా భాస్కర్‌రావు, పేడాడ రమణకుమారి, మంత్రి రాజశేఖర్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఊరుకుటి అప్పలనాయుడు, గుడివాడ అమ్మన్న, నాయకుల జెర్రిపోతుల.ముత్యాలు, సతీష్‌వర్మ, మంత్రి శంకరనారాయణ, మంత్రి మూర్తి, అచ్చిబాబు, ఈటిశ్రీరాములు, ప్రకాష్‌, ఆశ, వెంకట్‌, పద్మ, వెంకట్‌, రాంబాబు, రామకష్ణారా వు, సత్యనారాయణ తదితరులు పాలుగున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *