విద్యాలయాలపై సెల్‌టవర్లు ?

26akp3

  • అనారోగ్యాల బారిన చిన్నారులు
  • సరికొత్త ‘భాష్యం’ చెబుతున్న స్కూలు యాజమాన్యం
  • చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

అనకాపల్లిరూరల్‌, ఫీచర్స్‌ ఇండియా : మానవాళిని పట్టి పీడి స్తున్న ప్రధాన సమస్య రేడియేషన్‌. దీని ప్రభావంతో ఇప్పటికే పిచ్చుకలు, తూనీగలు, కాకులు వంటి పక్షి జాతి అంతరించి పోతుంది. మానవాళికి కూడా పలు అనారోగ్య సమస్యలను తీసుకువస్తుంది. వాస్తవానికి అధికారులతో పాటు విధ్యాదికులు సైతం ఈ రేడియేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది. ఇందులో ఉపాధ్యాయులకు మరింత బాద్యత ఉంది. కాని కంచె చేను మేసిన చందంగా తమ విద్యాలయంపైనే సెల్‌టవర్లు ఏర్పాటు చేసుకుని విద్యార్ధుల జీవితాలతో ఆటలాడుతున్న విద్యా సంస్థ యాజమాన్యాన్ని చూసి పలువురు ముక్కున వేలేసు కుంటు న్నారు. స్థానిక ఆమంచివారి వీధిలో భాష్యం పబ్లిక్‌స్కూలు భవనం పై భారీ సెల్‌టవర్లు ఉన్నాయి. ఈ సెల్‌టవర్లు నుంచి వచ్చే రేడి యేషన్‌ ప్రభావం ఆ చుట్టుపక్కల ప్రజలపై పడడమే కాక టవర్లు కింద విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధులపై మరింత ప్రభావం ఖచ్చి తంగా ఉంటుంది. ఈ విషయం విద్యాధికులైన యాజమాన్యంకు కూడా తెలుసు కాని వ్యాపారమే పరమావధిగా వీరు చిన్నారుల జీవితాలతో ఆటలాడుకుంటుండడం దారుణమైన విషయం. ఈ కార్పోరేట్‌ స్కూలుపై ఇప్పటికే పలు ఫిర్యాదులు విద్యాశాఖ అధి కారులకు అందాయి. కాని ఎందుకో చర్యలు మాత్రం లేవు తమ పిల్లలు అనారోగ్యం బారిన పడితే ఎందుకో అనుకునే తల్లి దండ్రులు కొందరైతే, తెలిసినా నిర్లక్ష్యంగా ఉన్న తల్లిదండ్రులు మరి కొందరు. ఇప్పటికే కొందరు పిల్లలు ఫిట్స్‌ వంటి వ్యాధులకు గురైనట్లు తెలిసింది. రేడియేషన్‌ ప్రభావం తమ పిల్లలపై పడు తుందని చర్యలు తీసుకోండి అని కొందరు తల్లిదండ్రులు యాజ మాన్యాన్ని ప్రశ్నిస్తే వారు చెబుతున్న సమాధానం వింతగా ఉంది. రేడియేషన్‌ ప్రభావం ఉండదట, కింద క్లాస్‌ రూమ్‌లో పిల్లలపై అసలు ప్రభావం చూపదని చెబుతున్నారని, వారితో వాదించేకంటే తమ పిల్లలను మానిపించి వేరే స్కూలులో జాయిన్‌ చేసినట్లు వేల్పులవీధికి చెందిన పి.అనంతలక్ష్మి విలేకరులకు తెలిపారు. సెల్‌టవర్ల ప్రభావం చిన్నారులపై పడుతుందని, ఇందుకు తన కూతురు అనారోగ్యమే ఇందుకు నిదర్శనమని ఆమె చెప్పారు.

ఆ స్కూలుపై చర్యలు తీసుకుంటాం….

విద్యాలయాలపై సెల్‌టవర్ల ఏర్పాటుపై మండల విద్యాశాఖాధికారి దివాకర్‌ను వివరణ కోరగా ఇప్పటికే పలు ఫిర్యాదులు ఆ స్కూలుపై వచ్చాయని, యాజమాన్యంను ఈ విషయమై ప్రశ్నించగా ఈ స్కూలును వేరే చోటుకు మార్చుతామని చెప్పి చాలాకాలమైందని, కాని యధాతదంగా కొనసాగుతున్న ఆ స్కూలుపై చర్యలు చేపడ తామని అన్నారు. విద్యాలయాలపై సెల్‌టవర్లు ఖచ్చితంగా చిన్నా రులపై ప్రభావం చూపుతుందని తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రేడియేషన్‌తో క్యాన్సర్‌ వంటి వ్యాధులు …

రేడియేషన్‌ ప్రభావంతో అన్ని రకాల క్యాన్సర్‌ వ్యాధులు సంక్ర మిస్తాయని పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్‌ కెకెవీఏ నారా యణరావు అన్నారు. చిన్నారులపై అయితే మెదడుపై రేడియేషన్‌ ప్రభావం అధికంగా ఉంటుందని అన్నారు. అందుకే రేడియేషన్‌ ఉత్పత్తి అయ్యే సెల్‌టవర్ల నిర్మాణం తమ ఇళ్లపై ఏర్పాటు చేసుకోవడానికి ఎవరూ అంగీకరించరని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *