వడదెబ్బకు వ్యక్తి మృతి

sun copy

కశింకోట, ఫీచర్స్‌ ఇండియా : మండలంలోని జమ్మదుల పాలెం గ్రామంలో వడదెబ్బకు వ్యక్తి మృతిచెందిన సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబందించి న వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కరక సత్యారావు( 47) ఎప్పటిలాగే సోమ వారం పొలం పనికి వెళ్ళాడు. అయితే సోమవారం ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో తీవ్ర అలసటకు గురైన సత్యారావు సాయం త్రం ఇంటికి చేరుకోగానే సొమ్మసిల్లిపడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108కి పోన్‌ చేశారు. 108 వాహనం సిబ్బంది వచ్చి చూడగా అప్పటికే సత్యారావు మృతిచెందినట్లు నిర్ధారించారు. ఇదిలా ఉండగా మృతిచెందిన సత్యారావు మాజీ ఎంపిటీసి కరక రాజు సోదరుడు కావడంతో మండలంలోని టిడిపి నాయకులు, యాదవ సంఘం నాయకులు భారీగా చేరుకొని సత్యారావు కుటుంబానికి సంతాపం తెలిపారు.

సబ్బవరంలో మన ఊరు-మన బడి

సబ్బవరం, ఫీచర్స్‌ ఇండియా : మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిం చాలని కోరుతూ స్థానిక ప్రభుత్వ హైస్కూల్‌ విద్యార్ధిని విద్యార్ధులు, ఉపాధ్యాయులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. హైస్కూల్‌ నుండి ప్రారంభమైన ర్యాలీ ఎన్టీఆర్‌ కూడలి వరకూ సాగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో ఆర్‌ ఆర్‌ కె నర్సింగరావు, పాఠశాల ప్రధానోపాధ్యా యులు ఎన్‌ ఎస్‌ ఎన్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

అనకాపల్లిటౌన్‌, ఫీచర్స్‌ ఇండియా: ప్రైవేటు పాఠశాలలతో పోల్చితే ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని కొత్తూరు మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానో పాధ్యాయుడు జి.అప్పారావు అన్నారు. మండలంలోని సుందర య్యపేట పంచాయతీలో మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా ర్యాలీలు, తల్లిదండ్రులకు అవగాహన సదస్సులు జరి గాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రేఖా అమ్మాజీ, ఎంపీటీసీ సభ్యుడు రాపేటి రాము, కమిటీ చైర్మన్‌ బాదపు రాజు తదితరులు పాల్గొన్నారు.

మే 1న ఆర్యవైశ్య పునర్వీవాహ పరిచయ కార్యక్రమం

 

విశాఖపట్నం, ఫీచర్స్‌ ఇండియా: విశాఖనగరంలోని ఒన్‌టౌన్‌ పరిధిలో ఉన్న వాసవి సంఘం ఆధ్వర్యంలో మే నెల 1న ఆర్యవైశ్య పునర్‌వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు ఆరిశెట్టి శ్రీరామ్మూర్తి తెలిపారు. బుధవారం విజెఎఫ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ విధి వక్రీకరించి జీవిత భాగస్వామిని కోల్పోయి ఒంటరి జీవితం గడుపుతున్నవారు ఎంతో మంది ఉన్నారని, అటువంటి వారికి పునర్‌ వివాహం చేసుకోవాలని ఆలోచన ఉన్న వారందరినీ ఒక వేదికపైకి తీసుకువచ్చి, పరిచయం చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిసు ్తన్నట్లు చెప్పారు. పునర్‌వివాహం చేసుకోదలచిన ఆసక్తి ఉన్నవారు మే ఒకటో తేదీన సోమవారం వాసవి కళ్యాణమండపం నకు హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం ఛైర్మన్‌ గోగుల రాజారావు, కార్యదర్శి అమర్‌నాథ్‌, కోశాధికారి కృష్ణారావు. తదితరులు పాల్గొన్నారు

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *