ప్రముఖ రచయిత్రి యద్ధనపూడి సులోచనారాణి ఇకలేరు
- 103 Views
- admin
- May 21, 2018
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం వంటిల్లు స్థానికం
కాలిఫోర్నియాలో గుండెపోటుతో మృతి
ఆమె రచనలకు ఇప్పటికీ ఆదరణే
ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి అమెరికాలో మరణించా రు. కాలిఫోర్నియాలోని కుమార్తె నివాసంలో ఆమె గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. సులోచనా రాణి మరణించిన విషయాన్ని ఆమె కుటుం బ సభ్యులు ధవీకరించారు. సులోచనారాణి 1940లో క ష్ణా జిల్లా కాజా గ్రామంలో జన్మించారు. భార్యాభర్తల మధ్య ప్రేమలు, కుటుంబ సంబంధాలు ప్రధానాంశంగా ఆమె నవలలు, కథలు రాశారు. గత కొన్నే ళ్లుగా ఆమె రచనలకు దూరంగా ఉంటున్నారు. చదువుకునే పిల్లలకు సాయం చేయడం, మానసిక సమస్యలు ఉన్న పిల్లల కోసం ఆమె ఓ పాఠశాల నడుపుతున్నారు. అగ్నిపూలు,
మీనా, విజేత, బహుమతి, బంగారు కలలు, అమరహదయం, మౌన తరంగాలు, సెక్రటరీ తదితర నవలలు రాశారు. ఆమె రచనలు సినిమాలుగా, టీవీ సీరియళ్లుగా వచ్చాయి. ఆమె రచనల్లో మధ్యతరగతి మహిళల పట్ల ప్రేమ, ఆప్యాయతలు కనిపిస్తాయి. సగటు మహిళ జీవితం ఆధారంగా ఆమె రచనలు సాగాయి. ఆమెకు శైలజ మాత్రమే ఏకైక సంతానం. సెక్రటరీ నవలను గర్భవతిగా ఉండగానే సులోచనారాణి రాశారు. సులోచనారాణి సినిమాలకు కూడా కథలను అందించారు. 1965లో మనుషులు – మమతలు సినిమాకు ఆమె కథ అందించారు. సులోచనా రాణి రాసిన మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాక ష్ణ, అగ్నిపూలు, ఛండీప్రియ, ప్రేమలేఖలు, విచిత్రబంధం, బంగారుకలం లాంటి నవలలు సినిమాలుగా వచ్చాయి.
నవలలు, ఈ తరంలోనూ హిట్టే!
తెలుగులో నవలలు నిరాదరణకు గురవ్వడం మొదలై చాలా కాలం అయ్యింది. ఒక దశలో తెలుగు పాఠకలోకాన్ని ఉర్రూతలూగించాయి నవలలు. 70,80లలో నవలలదే రాజ్యం. నవలలే యువతరానికి ప్రధానమైన ఎంటర్టైన్మెంట్. ఆ దశలో అనేక మంది రచయితలు, రచయిత్రులు సెలబ్రిటీల్లా వెలుగొందారు. అలాంటి వారిలో ప్రముఖురాలు యద్దనపూడి సులోచనా రాణి. పాత్రా చిత్రణలో ప్రత్యేకత కలిగిన రచయిత యద్దననపూడి. అలాంటి పాత్రలతో ఈమె రచించిన నవలలు తెలుగు వారిని ఆకట్టుకున్నాయి. కాలక్రమేణా తెలుగునాట నవలలకు ఆదరణ తగ్గిపోయింది. టీవీలు, వీసీఆర్లు అందుబాటులోకి రావడంతోనే నవలాయుగాంతం మొదలైంది. ఇక సీడీ ప్లేయర్ల కాలానికి వచ్చే సరికి నవలలు కేవలం లైబ్రరీలకే పరిమితం అయిపోయాయి. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చే సరికి.. నవలా మెరుపులు పూర్తిగా కనుమరుగైపోయాయి.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొందరు రచయితల పేర్లు తెలుగు వాళ్లకు సుపరిచితమే. వాళ్లు రాయడం ఆపి చాలా కాలం అయిపోయింది, వారి నుంచి గొప్ప నవలలు వచ్చి దశాబ్దాలు గడిచిపోయాయి. అయినప్పటికీ వాళ్లు తెలుగు వారికి సుపరిచితులే. వారిలో ముందుంటారు యద్దనపూడి సులోచనా రాణి. ఆమె ప్రభావం ఎంత? అంటే దశాబ్దాల క్రితం యద్దనపూడి రచించిన నవలలు నేటికీ సినిమాలకు పనికొచ్చే కథలు అవుతున్నాయి. ఇంటర్నెట్ యుగంలో కూడా యద్దనపూడి రాసిన నవలను సినిమాగా తీసి వదిలితే అది నేటి యువతరాన్ని ఆకట్టుకుంది. యద్దనపూడి రచనా గొప్పదనాన్ని చెప్పడానికి అలాంటి నిదర్శనమే ‘అ..ఆ’సినిమా. నితిన్ హీరోగా, సమంత హీరోయిన్గా త్రివిక్రమ్ దర్శకత్వంలో రెండేళ్ల కిందట వచ్చిన ఈ సినిమాకు మూల కథ యద్దనపూడి సులోచనారాణిదే. నవలగా ‘మీనా’ వచ్చిన 42 యేళ్ల తర్వాత ‘అ..ఆ’ సినిమా వచ్చింది. నవలగా ఎంత ఆదరణ పొందిందో ‘అ..ఆ’ సినిమాగా కూడా అంతే ఆదరణ పొందింది యద్దనపూడి రచన. రచయితగా యద్దనపూడి గొప్పదనానికి ఇది నిదర్శనం. నాలుగు దశాబ్దాల తర్వాతి తరాన్ని ఆకట్టుకునేలా అప్పట్లోనే రచనలు చేసిన రచయిత ఆమె. యద్దనపూడి ఇతర నవలలను తరచి చూసినా, ఈ తరాన్ని ఆకట్టుకునే కథా,కథనాలు వాటిల్లో ఉంటాయి.


