నకిలీనోట్ల ముఠా అరెస్ట్
- 17 Views
- admin
- May 8, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
విజయనగరం, ఫీచర్స్ ఇండియా : ప్రభుత్వం తయారు చేసిన నోట్లను కలర్ జెరాక్స్‌లు తీసి మార్చుతున్న ముఠాను పట్టుకున్నట్లు విజయనగరం వన్‌టౌన్ సిఐ పీ శోభన్‌బాబు చెప్పారు. విజయనగరం వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడా రు. పశ్చిమబెంగాల్‌కు చెందిన హసాదుల్లా షేక్, విజయవాడకు చెందిన అకుల వెంకటదుర్గ శేషుబాబు, శివ్వరపు శ్రీనివాస రావుతో కలిసి పశ్చిమబెంగాల్‌కు చెందిన సయ్యద్ షేక్, షరిఫుల్ షేక్‌లు, ప్రభుత్వం ముద్రించిన నోట్లను అచ్చంగా అలాగే జెరాక్స్ తీసి చలామణి చేస్తున్నారన్నారు. ఐదు రోజుల క్రితం ఈ ముఠా విజయన గరం చేరుకున్నట్లు సమాచారం వచ్చింద న్నారు. హసాదుల్లా షేక్, ఆకుల వెంక టదుర్గ శేషుబాబు, శివ్వాపు శ్రీనివాసరావు రైల్వేస్టేషన్ సమీపాన అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకున్నారు. ముగ్గురు వేర్వేరుగా సమాధానం చెప్పడంతో వీరిని విచారించగా అసలు విషయాన్ని ఒప్పుకు న్నారన్నారు. హసాదుల్లా వద్ద రూ.2వేలు నోట్లు 9, ఆకుల వెంకట దుర్గ శేషుబాబు వద్ద 9నోట్లు, శివ్వాపు శ్రీనివాసరావు వద్ద 4నోట్లు ఉన్నాయన్నారు. ఆ నోట్లను పట్టుకుని విచారించగా ఒకే నెంబర్లతో ఉన్న నోట్లు ఉన్నాయన్నారు. వీటిని పశ్చిమబెంగాల్లో కలర్ జెరాక్స్‌లు తీసి మారుస్తున్నట్లు తెలుస్తోందన్నారు. అరెస్ట్ చేసిన వారిపై ఛీటింగ్, నోట్ల మార్పిడి కేసులు ఉన్నాయన్నారు. పూర్తిస్థాయి విచా రణ జరిపి ఈ కేసులో మిగతా నింది తులను పట్టుకుంటామన్నారు. కేసును చేధించిన ఎస్ఐ, సిబ్బంది ఆయన అభినం దించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు జీఎవి రమణ, ఎస్ ధనుంజయరావు, ఎస్ లక్ష్మణరావు, వెంకటరావు, సిబ్బంది పాల్గొన్నారు.


