ప్రత్యక్ష రాజకీయాల్లోకి తులసీరావు
- 12 Views
- admin
- March 7, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
యలమంచిలినేతలంతా అమరావతికి పయనం———————
యలమంచిలి, ఫీచర్స్ ఇండియా: డెయిరీ ఛైర్మన్ ఆడారి తులసీరావు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి తొలిసారిగా అంగీకరించి అడుగు పెట్టబోతున్నారన్న వార్త వారి అభిమానుల్ని ఆనందంలో ముంచేసింది. రాజకీయాల్లో కింగ్‌మేకర్‌గా వ్యవహరించారు గాని కింగ్ పాత్ర పోషించలేదనేది జగమెరిగిన సత్యం. తన కుమారుడి అభీష్టం మేరకు పార్టీ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న తులసీరావు ఇప్పటికే రాజధాని చేరుకున్నారు. ఆయనతోపాటు నియోజకవర్గం తెలుగుదేశం నేతలంతా అమరావతికి చేరుకున్నారు. అనకాపల్లి పార్లమంటు నియోజక వర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలంతా తమతమ మద్దతుదార్లతో గురువారం ఉదయానికి ఆంధ్రప్రదేశ్ రాజధానికి చేరుకున్నారు. పార్లమెంటు సెగ్మెంట్ లోని కొన్ని నియోజకవర్గాల్లోని అసమ్మతి వాదులు కూడా ముందుగానే అక్కడికి చేరుకున్నారని సమాచారం. అమరావతి వెళ్లిన వారిలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, డెయిరీ ఛైర్మన్ ఆడారి తులసీరావు, మున్సిపల్ ఛైర్పర్సన్ పిళ్లా రమాకుమారి, కృషి ఐకాన్ ఆసుపత్రి సీఈఓ ఆడారి ఆనందకుమార్, మరో సీనియర్ నేత లాలం భాస్కర రావులు ఉన్నట్టు తెలిసింది. తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి డెయిరీ ఛైర్మన్ తులసీరావు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. తన కుమారుడు ఆనంద్‌ను రాజకీయ వారసుడిగా కొనసాగడానికి అనకాపల్లి పార్లమెంటు స్థానం ఆశిస్తున్నట్టు వారి అనుచరులు చెబుతున్నారు. మరే కారణం చేతనైనా పంచకర్ల యలమంచిలి స్థానం నుంచి పోటీ చేయకపోతే ఆ సీటు తమకు కేటాయించమని తులసీరావు అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎలాగైనా ఆడారి ఆనంద్‌కుమార్ రాజకీయాల్లోకి రావాలని స్థానిక యువత పట్టుబడు తోంది. దానికి అనుగుణంగానే తులసీరావును ఒప్పించారని తెలుస్తోంది.


