మోదీ బ్రహ్మాస్త్రాలు.. ప్రతిపక్షాల బెంబేలు..
- 11 Views
- admin
- March 13, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం
వీధి చివర్లోనో, టీ కొట్టు దగ్గరో, పాన్ షాపు, రోడ్డుపక్కన, బస్టాండ్ వద్ద కొద్దిసేపు నిల్చుంటే చాలు మార్పు రాబోతుందని విూరు అర్థం చేసుకోగలరు. కొన్నాళ్ల తర్వాత మన ఊహకు అందని విధంగా బలమైన మద్దతుదారులు కూడా దూరమవడం మనం చూడొచ్చు.
1976లో పరిస్థితుల గురించి తెలియనివారు 1987-88లో చోటు చేసుకున్న రాజకీయ వాతావరణాన్ని తప్పకుండా గుర్తుతెచ్చుకుంటారు. 400 స్థానాల్లో గెలిచి 42 ఏళ్ల వయసులోనే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. కానీ, 1989లో అంతే వేగంతో గద్దె దిగారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తన కాళ్ల విూద తాను నిలబడలేకపోతోంది.
1989లో చిన్నపిల్లలుగా ఉన్నవారికి, పుట్టనివారికి 2013లో జరిగిన అధికార మార్పిడి గురించి తెలిసే ఉంటుంది. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఒక రంధ్రం మూసివేస్తే మరో రంధ్రం నుంచి నీళ్లు వెళ్లిపోయాయి.
అయితే, చాలా ఏళ్ల నుంచి ప్రతిపక్షంలో ఉంటున్న కాంగ్రెస్ ఇప్పటికీ ఎందుకు రంధ్రాలు మూసేస్తోంది? నరేంద్ర మోదీ, ఆయన రాజకీయాల వల్ల తమ మనుగడ సంక్షోభంలో పడుతోందని ప్రతిపక్షాలన్నీ భావిస్తుంటే, రఫేల్ వివాదంలో రాహుల్ ఒక్కరే ఎందుకు ఒంటరి అయిపోయారు? రఫేల్ వివాదంపై ఇందులో ఏదో తప్పు జరుగుతోంది అని ఒక్కోసారి మమతా బెనర్జీ ఆరోపిస్తుంటారు.
జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ చేపట్టాలని సీతారాం ఏచూరి డిమాండ్ చేస్తుంటారు. మరోవైపు సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చాక ఇక విచారణ అవసరం లేదని అఖిలేశ్ యాదవ్ అంటుంటారు.
ఈ రాజకీయ అరణ్యంలో రాహుల్ గాంధీ ఒక్కరే ‘కాపాలదారుడే దొంగ’ అంటూ ఒంటరిగా కేకలు వేస్తూ తిరుగుతున్నట్లు ఎందుకు కనిపిస్తుంది!! ఎవరూ ఆయన మాట వినడం లేదు. ఆయనొక్కరే ఆయన ప్రతిధ్వనిని వింటున్నారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో పాత వైషమ్యాలను మరిచిపోయి బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, సమాజ్ వాదీ పార్టీకి చెందిన అఖిలేశ్ యాదవ్ కలిసిపోవడం మంచిదే.
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, శరద్ యాదవ్, లాలూ కుమారుడు ఇతర ప్రతిపక్ష నేతలు చేతులు కలపడం అప్పుడప్పుడు దినపత్రికల్లో కనిపిస్తుంది. కానీ, 1987-88 కాలంలో రాజీవ్‌కు వ్యతిరేకంగా గళమెత్తిన కార్మికసంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు ఇప్పుడు ఎక్కడున్నాయి?
ఇప్పుడు విూరు టీవీ వార్తలను చూస్తే 2013 ఘటన పునరావృతం అవుతుందని అనిపిస్తుంది. ప్రతి టీవీ తెరవిూద నరేంద్ర మోదీనో, ఆయన సన్నిహితుడు అమిత్ షానో దర్శనమిస్తారు. ఒక వేళ టీవీ తెరపై రాహుల్ గాంధీ కనిపిస్తే ఆ కార్యక్రమం అంతా అనాసక్తికరంగా మారుతుంది.
నరేంద్రమోదీ, అమిత్ షాలు సర్వశక్తులు కేంద్రీకరించినప్పటికీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఇటీవల బీజేపీ అధికారం కోల్పోయింది. మోదీ మ్యాజిక్ ఇక అయిపోయిందని ఆ సమయంలో అనిపించింది.
దాదాపు నిరాశలో కూరుకుపోయిన సంఘ్ పరివార్ వ్యూహకర్తలు మరోసారి రామ మందిర పేరుతో హిందువుల ఐక్యతను తెరవిూదకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే, సుప్రీం కోర్టు తీర్పు కూడా వారికి సహాయం చేయలేదు. దీంతో అమిత్ షా ఆందోళనకు గురవుతున్నారు. విశ్వహిందూ పరిషత్ కూడా ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకు సిద్ధం అవుతోంది. మరోవైపు ఎన్నికల సమయంలోనే రామ మందిర వివాదాన్ని ఎందుకు ఎత్తుకుంటారని ప్రజలు బీజేపీని నిలదీస్తున్నారు. అయితే, సంఘ్ పరివార్ ఈ అంశాన్ని మళ్లీ లేవనెత్తుకుంటుంది.
దేశ ‘తలరాత’ను మార్చకుండా, మార్పును వ్యాపించకుండా నిరోధించడం సాధ్యంకాదని నరేంద్ర మోదీ, అమిత్ షా, నాగ్‌పూర్ కేంద్ర కార్యాలయంలోని సంఘ్ నేతలు అర్థం చేసుకోవాలి.
పుల్వామా ఘటనతో దేశంగ్భ్భ్రాంతికి గురైంది. పాకిస్తాన్‌కు సరైన సమాధానం ఇస్తామని తనదైన శైలిలో ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన మోదీ ఇప్పుడు ఎలా మౌనంగా ఉండగలిగారు? ఇప్పుడు విలన్‌ను బంధించే హీరో రంగప్రవేశానికి దేశమంతా ఎదురు చూస్తోంది.
చాలా మంది టీవీ వ్యాఖ్యాతలు… మోదీకి అనుకూలురుగా మారారు. ప్రభుత్వం, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఏవిూ చెప్పకుండానే బాలాకోట్ ఘటనలో 300 నుంచి 400 మంది ఉగ్రవాదులు హతమయ్యారని మొదట టీవీ చానెళ్లు వార్తలు ప్రసారం చేశాయి. ఈ ఘటనలో 250 మంది చనిపోయారని బీజేపీ అధినేత అమిత్ షా లెక్కగట్టారు. దాడిపై సాక్ష్యాలు కావాలని అడిగిన రాహుల్ గాంధీ సిగ్గుపడాలని విమర్శించారు.
నోట్లరద్దు, జీఎస్టీ నిరుద్యోగితను పెంచింది. రైతులు నష్టపోయేలా చేసింది. ప్రభుత్వ సంస్థల కాషాయీకరణ, రఫేల్ విమానాల కొనుగోలులో కుంభకోణం ఇవన్నీ కూడా సోషల్ విూడియాలో వ్యాపించిన జాతీయభావంతో తటస్థమయ్యాయి.
కథనంలో ఊహించని ఈ మలుపు తొలిసారి ఓటేస్తున్నవారికే కాదు, అధికారం నుంచి పడిపోయిన రాజీవ్ గాంధీని చూసినవారికి కూడా కొత్తదే. రాజీవ్ గాంధీని ‘మిస్టర్ క్లీన్’ అనేవారు. కానీ, బొఫోర్స్ కుంభకోణం ఆయనను పదవి నుంచి దింపేసింది.
ఆ సమయంలో రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ కలిసి రాజీవ్‌పై విమర్శలు ఎక్కుపెట్టాయి. ”గల్లీ గల్లీ మే షోర్ హై, రాజీవ్ గాంధీ చోర్ హై” అని పట్నా నుంచి పాటియాలా వరకు నినాదాలు వినిపించాయి. రాజీవ్ మంత్రివర్గంలో ఉన్న విశ్వనాథ ప్రతాప్ సింగ్ తిరుగుబాటు చేసి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించారు.
ఈ రోజు నరేంద్ర మోదీ కూడా అదే విధంగా రాహుల్ గాంధీ ముంగిట ఉన్నారు. మంచిరోజులు వస్తాయని ఐదేళ్ల కిందట చెప్పిన వ్యక్తి నిరుద్యోగితను నివారించలేకపోయారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయలేకపోయారు. పరిశ్రమలను మూసివేయించారు. ఉద్యోగులను తొలగించారు. చివరకు అనిల్ అంబానీకి లబ్ధి చేకూరేలా రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలులో ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
2014తో పోల్చితే నరేంద్ర మోదీ ప్రభావం ఇప్పుడు తగ్గిందని స్పష్టంగా తెలుస్తోంది. అప్పుడు ప్రజలకు ఆయన గురించి తక్కువగా తెలుసు. దీంతో ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు. ఈ ఐదేళ్లలో మోదీ వ్యూహాలు, వ్యక్తిత్వం గురించి ప్రజలు తెలుసుకున్నారు. అయినప్పటికీ అధికారాన్ని ప్రతిపక్షాల చేతుల్లో పెట్టేందుకు మోదీ అవకాశం ఇవ్వరు. ఆయన ఇప్పటికీ తన అమ్ములపొదిలో ఉన్న బ్రహ్మాస్త్రాలను ఒక్కోటి వదులుతూనే ఉన్నారు. మరోవైపు ప్రతిపక్షాలు మౌనాన్నే ఆశ్రయిస్తున్నాయి.


