దక్షిణంలో రెబల్‌గా నిలబడతా
- 10 Views
- admin
- March 13, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
ముస్లింలకు సీటివ్వకపోతే వెనక్కి తగ్గేదిలేదు—————-
విలేకరులతో ముస్లిం, మైనార్టీ నేత ఎం.డి.సాధిక్ వెల్లడి————————
డాబాగార్డెన్స్, ఫీచర్స్ ఇండియా : అనుకున్నట్టే జరగబోతోంది. దక్షిణంలో టీడీపీ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి పై రెబల్ అభ్యర్ధి సిద్దమవుతున్నారు. మొదట నుంచి వాసుపల్లి తీరుపై గుర్రుగా ఉన్న ఆ నియోజక వర్గ ముస్లిం, మైనార్టీలు ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే ఆ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు మాజా ఎమ్మెల్యే ఎస్.ఏ.రెహ్మాన్, జహీర్ అహ్మద్ తదితరులు ముస్లిం నేతలతో కలిసి వాసుపల్లికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఆయనకు టికెట్ ఇవ్వొద్దని అధిష్టానానికి చెప్పారు. ఒకవేల తమ నిర్ణయాన్ని కాదని వాసుపల్లికే టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామని బహిరంగంగానే తిరుగుబాటు జెండా ఎగురవేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా అదే సామాజిక వర్గానికి చెందిన ఎం.డి.సాధిక్ దక్షిణ నియోజక వర్గంలో ఎక్కువ మంది ముసిం, మైనార్టీలు ఉన్నారని ఆ సీటు ఓటు ప్రాతిపదికగా ముస్లింలకే కేటాయించాలని, లేదంటే తమ వర్గానికి న్యాయం చేసేలా సిటీ పరిధిలో ఉన్న ఉత్తరం సీటును ఇస్తారని బావించామని అక్కడ మంత్రి లోకేశ్ బరిలో దిగడంతో తమకు అన్యాయం జరుగుతుందని బావిస్తున్నారు. ఈ మేరకు బుధవారం పౌరగ్రంధాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉత్తరం సీటును లోకేశ్ కేటాయించిన నేపధ్యంలో దక్షిణం సీటును తమకు ఇవ్వకపోతే ఖచ్చితంగా వాసుపల్లి పై రెబల్ అభ్యర్ధిగా పోటీకి దిగుతానని ఎండీ సాధిక్ స్పష్టం చేసారు. విశాఖ పరిధిలో ఒక్క సీటు కూడా ముస్లింలకు ఇవ్వకపోవడం పై టీడీపీ పై ఆయన మండిపడ్డారు. ముస్లింలను అనగదొక్కడం తగదన్నారు.
దక్షిణం సీటుపై సీఎం నిర్ణయం మార్చుకోవాలని లేదంటే ఖచ్చితంగా రెబల్ అభ్యర్ధిగా పోటీకి దిగుతానని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎండి ఖాదిల్ బాయ్, ఎండి ఆసిఫ్, అబ్దుల్ ఖాదిర్, మాజీ కార్పొరేటర్ రామారావ , అప్పల నరసమ్మ, రామలక్ష్మి ఎస్ కె నాగూర్ తదితరులు పాల్గొన్నారు.


