5 ఏళ్ల రాష్ట్ర అభివద్ధే నమూనా !
- 17 Views
- admin
- March 16, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రచారం————-
టీడీపీ ప్రజాధరణ చూసి వైసీపీ కుళ్లుకుంటోంది—————–
తప్పులు చేసి తప్పించుకోవడం జగన్కు అలవాటే—————
టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు————–
అమరావతి, ఫీచర్స్ ఇండియా : 5 ఏళ్ల మన అభివద్ధి, సంక్షేమం దేశానికే నమూనాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పుకొచ్చారు. పార్టీ నేతలతో శనివారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ రోజు తిరుపతి నుంచే తెలుగుదేశం విజయ శంఖారావం పూరించనున్నట్లు తెలిపారు. దైవ దర్శనం తరువాత శ్రీకాకుళం నుంచి ప్రజల్లోకి వెళ్తున్నట్లు చెప్పారు. ‘ప్రజలే దేవుళ్లు-సమాజమే దేవాలయం’ అనే నినాదంతో ఏర్పడ్డ పార్టీ తెదేపాయే అని నేతలతో అన్నారు.
అన్నదాత సుఖీభవ, పసుపు- కుంకుమ ప్రజల్లోకి వెళ్లిందని, రైతులు, మహిళలు, యువతరం మద్దతు తెదేపాకే ఉందన్నారు. తెలుగుదేశానికి ఉన్న ప్రజాదరణ చూసి వైకాపా నేతలకు కంటగింపు కలిగిందన్నారు. ఆ అక్కసుతోనే తెదేపాపై నిందలు వేస్తున్నారన్నారు. వివేకానంద రెడ్డి హత్యను రాజకీయం చేస్తున్నారని, ఆయన హత్య వాళ్ల ఊళ్లో, వాళ్ల ఇంట్లో జరిగిందని చెప్పారు. ఈ హత్యపై తెదేపాని నిందించడం అమానుషమని వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకా హత్యకేసులో ఆయన్ని చంపడం వల్ల ఎవరికీ లాభమో వాస్తవాలన్నీ బహిర్గతం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తప్పులు చేసి తప్పించుకోవడం జగన్కు అలవాటేనని విమర్శించారు. రాజకీయ లాభాల కోసమే కోడికత్తి కేసు తెచ్చారని, ఎన్నికల కోసమే షర్మిలతో పాత కేసులు మళ్లీ పెట్టించారని ఆరోపించారు. నీతిమాలిన రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని కార్యకర్తలను కోరారు. తెదేపాని ఇబ్బంది పెట్టేందుకే భాజపా, వైకాపా కుట్రలు పన్నాయన్నారు.


