గాజువాక, భీమవరం నుంచి పవన్ పోటీ!
- 10 Views
- admin
- March 19, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
అమరావతి, ఫీచర్స్ ఇండియా : ఇప్పటి వరకు మూడు జాబితాల్లో 77 మంది అభ్యర్థులను ప్రకటించిన పవన్, తన పోటీ చేసే స్థానాలపై నిర్ణ యం తీసుకున్నారు. తాజాగా, జన సేనాని పోటీ చేసే అంశంపై స్పష్టత వచ్చింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే అంశంపై స్పష్టత వచ్చింది. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ నగర పరిధి లోని గాజువాక శాసనసభ స్థానాల నుంచి బరిలోకి దిగ నున్నారు. ఈ మేరకు ట్విట్టర్ జనసేన పార్టీ ప్రకటిం చింది. తాను రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తు న్నట్టు మంగళవారం ఉదయం పవన్ కల్యాణ్ తెలియ జేసిన విషయం తెలిసిందే. తన పోటీపై జనసేన పార్టీ కార్యవర్గం నిర్ణయం తీసుకుందని, ఎక్కడ నుంచి పోటీ చేసేది గంట తర్వాత వెల్లడిస్తానని తెలిపారు.
పవన్ ఎక్కడ నుంచి పోటీ చేయా లనే అంశంపై జనరల్ బాడీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టింది. ఇందులో అనంతపురం, తిరుపతి, రాజానగరం, పిఠాపురం, భీమవరం, గాజువాక, పెందుర్తి, ఇచ్చాపురం నియోజక వర్గాలు తొలి స్థానంలో నిలిచాయి. ఈ ఎనిమిదింటిపై అంతర్గత సర్వే నిర్వహించిన మేధావులు, రాజకీయ పరిశీలకులు చివరకు గాజువాక, భీమవరం స్థానాల నుంచి పోటీచేయాలని పవన్‌కు సూచించారు. వారి ప్రతిపాదనలకు పవన్ సానుకూలంగా స్పందించారు.


