తేలని టీడీపీ టికెట్ల లొల్లి !
- 10 Views
- admin
- March 19, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
సబ్బం హరికి భీమిలి టికెట్ కేటాయించిన టీడీపీ———————
ప్రకటన తరువాత అర్దరాత్రి అమరావతికి బయల్దేరిన హరి—————
ఎంపీగా అవకాశం ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి————–
పార్టీలో చేరకముందే టికెట్ ఇవ్వడంపై తమ్ముళ్లు అసహనం !————-
భీమిలి సీటు లోకల్ వారికి ఇవ్వాల్సిందేనంటున్న తమ్ముళ్లు—————
సీఎం వద్దకు విశాఖ ఎంపీ శ్రీ భరత్ పంచాయితీ——————-
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా: అధికార టీడీపీలో సీట్లు పంచాయితీ తేలడం లేదు. ముఖ్యంగా విశాఖ ఎంపీ సీటుతో పాటు భీమిలి, గాజువాక సీట్లుపై క్లారిటీ రావడం లేదు. పార్టీ అధిష్టానం నాన్చి నాన్చి సోమవారం అర్ధరాత్రి విశాఖ ఎంపీగా శ్రీ భరత్ పేరును ప్రకటించింది. దీంతో పాటు భీమిలి నుంచి సబ్బం హరి, పెందుర్తి నుంచి సిటింగ్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావులు పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో చిక్కుముడి వీడిందని ఇక హ్యాపీగా ప్రచారం చేసుకోవచ్చునుకున్నారు. ఐతే భీమిలి ఎమ్మెల్యే అభ్యర్ధిగా సబ్బం హరి పేరు ప్రకటించిన తరువాత ఆయన తన అనుచరులతో కలిసి అర్దరాత్రి హుటాహుటిన అమరావతి బయల్దేరారు. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసారు. తనపై నమ్మకంతో భీóమిలి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారని ఐతే తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనని అవకాశం ఇస్తే విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. శ్రీ భరత్‌కు ఎంపీ సీటు ప్రకటించామని ఫైనల్‌గా సాాయంత్రం మాట్లాడదామని ప్రచారంకు వెల్లి వచ్చిన తరువాత ఫైనల్ చేద్దామని చెప్పి సీఎం వెల్లిపోయినట్లు భోగట్టా. దీంతో కథ మల్లీ మొదటికి వచ్చినట్లయిందని తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. ఒకవేల విశాఖ ఎంపీగా హరిని ప్రకటిస్తే శ్రీ భరత్ వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు పార్లమెంట్ పరిధిలో మెజార్టీ ఎమ్మెల్యేలు భరత్‌ను ఎంపీగా మద్దతు తెలిపారు. ఈ సమయంలో సబ్బం ఎంపీ సీటు అడిగితే ఎలా అంటూ తలలు పట్టుకుంటున్నారు. మంత్రి గంటా తో పాటు పలువురు సీనియర్లు చెప్పినప్పటికీ ఎంపీ పైనే హరి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. నామినేషన్లుకు సమయం దగ్గరపడుతుండడమే కాకుండా, ప్రచారానికి టైం లేకపోవడం ఈ సమయంలో సీట్లు లొల్లి పెట్టుకోవడం ఎందుకని వారు చెబుతున్నారు. ఏది ఏమైనా సబ్బం మంటలు టీడీపీలో ఆరుతాయా రాజుకుంటాయా చూడాలంటున్నారు.
పార్టీలో చేరక ముందే టికెట్ ఇవ్వడం పై తమ్ముళ్లు
పార్టీలో చేరకముందే టికెట్ ఇవ్వడం టీీడీపీ చరిత్రలో లేదని లేని సాంప్రదాయాన్ని చంద్రబాబు తెచ్చి అవమానాలు పడాల్సిన అవసరం ఏముందని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీగా శ్రీ భరత్ పోటీ చేస్తానని ఎప్పుడు నుంచో చెబుతున్నారని ఆయనకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ ఎంపీ సీటు పై నాన్చాల్సిన అవసరం ఏముందని తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. అలాగే భీమిలి సీటును స్థానికులుకు ఇవ్వాలని అక్కడి వారు అడుగుతన్నా పట్టించుకోకుండా పార్టీలో చేరని సబ్బం హరికి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందంటున్నారు. పార్టీలో పోటీ చేసే వారా లేరా అన్న సంకేతాలు వెల్తున్నాయని అంత చేతగాని తనంగా ఎందుకు వ్యవహరించాలో చెప్పాలని వారిలో వారే విరుచుకుపడుతున్నారు. పోనీ తరువాత పార్టీలో చేరుతారనుకుని భీమిలి టికెట్ ఇస్తే హరి తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనని విశాఖ ఎంపీ గా పోటీ చేస్తాననడం పైన వారు పెదవి విరుస్తున్నారు. స్థానికులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే తడాఖా చూపిస్తామని అవసరమైతే పార్టీకి వ్యతిరేకంగా పని చేసి తమ నిర్ణయాన్ని దిక్కరించినందుకు అభ్యర్ధిని ఓడించి తీరుతామని భీమిలి నేతలు చెబుతున్నట్లు తెలుస్తోంది.


