అప్పన్న పెళ్ళికొడుకాయినే.. వైభవంగా డోలోత్సవం
- 15 Views
- admin
- March 21, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం వంటిల్లు స్థానికం
సింహాచలం, ఫీచర్స్ ఇండియా : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహ లక్ష్మి నసింహ స్వామి అప్పన్న పెళ్లిచూపులు అత్యంత వైభవంగా జరిగాయి. ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి విశేష పూజలు నిర్వహించి మెట్లమార్గం గుండా తీసుకువచ్చి పుష్కరిణి సత్రంలో నున్న ఉద్యాన మండపంలో ప్రత్యేకంగా తయారు చేసిన డోలకిలో అధిష్టింపజేశారు. స్వామివారిని గోవిందరాజు స్వామి అలంకరణలో బుగ్గన చుక్కపెట్టి పెళ్లికుమారునిగా ముస్తాబు చేసారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగులతో అర్చకులు, భక్తులు, ఆలయ అధికారులు రంగులు జల్లుకుని వసంతోత్సవం జరుపుకున్నారు. అనంతరం ఘనంగా స్వామివారి తిరువీధి నిర్వహించారు. పెళ్లికుమారుని అవతారంలో బుగ్గన చుక్కనుపెట్టుకుని ఉన్న అప్పన్న స్వామివారిని చూసిన భక్తులు పులకించిపోయి ఆనందడోలికల్లో మునిగిపోయారు. అప్పన్న పెళ్లికొడుకు కావడంతో ఆనందోత్సాహాల నడుమ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని సంబరం చేసుకున్నారు. దీంతో నేటినుండి పెళ్లిపనులు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కార్యనిర్వహ ాణాధికారి క ష్ణమాచార్యులు, ఆలయ ప్రధానార్చకులు గొడవర్తి గోపాలకష్ణమా చార్యులు, వైదికులు అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


