టీడీపీ ద్వారానే యువతకు మంచి భవిష్యత్
- 9 Views
- admin
- March 28, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్———————
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : యువతకు అధ్భుతమైన భవిష్యత్ టీడీపీతోనే సాద్యమని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఎన్నికల ప్రచార భాగంగా గురువారం ఆయన విశాఖ వచ్చారు. ఈ సంధర్బంగా ఓ హోటల్లో విద్యార్దులుతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అనేక పరిశ్రమలు ద్వారా యువతకు ఉపాధి కల్పించామ న్నారు. ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి కుటుంబా లకు ఆశరాగా నిలిచామన్నారు. ఐటీ హబ్ ఏర్పాటు చేసామని దీని ద్వారా వేలాది మందికి ఉపాధి పొందు తున్నారన్నారు. యువతను ఆదుకోవడమే టీడీపీ లక్ష్యమన్నారు. యువత అంతా ఆలోచించి రాష్ట్రాభి వృద్దికి పాటుపడుతున్న పార్టీని మనకు అందు బాటులో ఉండే అభ్యర్ధులను ఎన్నుకోవాలన్నారు. విశాఖలో ఉండేవారు అంతా మేధావులేనని ఆలోచించి ఓటు వేస్తారన్న నమ్మకం తనకుందన్నారు. చాలా మంది మభ్య పెట్టి కుట్రలు పన్ని డబ్బులు, మందు ఎర వేసి గెలవాలని చూస్తున్నారని అవన్నీ ఇక్కడ ఓటర్లు తిప్పికొడతారన్నారు. గత ఎన్నికల్లో విశాఖ వాసులు అధ్భుతమైన తీర్పు ఇచ్చారని అదే పంథాలో ఇప్పుడు నడుచుకుంటారని ఆశాబావం వ్యక్తం చేసారు.
లోకేశ్‌ను కలిసిన భరణికాన :
విశాఖ వచ్చిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ను టీడీపీ సీనియర్ నాయకుడు ఫీచర్స్ ఇండియా ఎండీ భరణి కాన రామారావు మర్యాద పూర్వకంగా కలిసారు. విశాఖతో పాటు తాను నివాసముంటున్న ఉత్తర నియోజక వర్గం లో జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై వివరించారు.


