మన రాష్ట్రంపై ఇంత అక్కసా !
- 11 Views
- admin
- March 30, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
కష్టపడి శ్రమతో అభివృద్ధి చేసుకుంటుంటే మనపై కేంద్రానికి ద్వేషం———-
ధైర్యముంటే మోడీ చెప్పిన దానికి శ్వేతప్రతం విడుదల చేయాలి.. లేదా మనమే చేస్తాం———-
దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి————
అటు కేంద్రం.. ఇటు ప్రతిపక్షం కుట్రలు చేస్తున్నాయి———
నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు—————-
అమరావతి, ఫీచర్స్ ఇండియా : కష్టపడి శ్రమతో అభివద్ధి చేసుకుంటున్న రాష్ట్రంపై ఇంత అక్కసా అని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్ర బాబు నాయుడు ప్రశ్నించారు. ఎలక్షన్ మిషన్ 2019పై ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కొద్దిరోజుల్లో జరగనున్న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్ణ యించేవని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల బాధ్యత మాది కాదనే ధోరణి సరి కాదని, పొరబాటు చేస్తే మొత్తం రాష్ట్రం పెను ప్రమాదంలో పడుతుందని చంద్ర బాబు హెచ్చరించారు. దీనివల్ల అన్నివర్గాల భవిష్యత్తు, పేదల సంక్షేమం చిక్కుల్లో పడుతుందని, కర్నూలు సభలో రాష్ట్రంపై మోదీకి ఉన్న ద్వేషం మరోసారి బయట పడిందని ఆక్షేపించారు. ధైర్యముంటే చెప్పి నదానికి, చేసిన దానికి శ్వేతపత్రం విడు దల చేయాలని డిమాండ్ చేశారు. వాళ్లు చేయకుంటే మనమే శ్వేతపత్రం విడుదల చేద్దామని, వాళ్లు ఢీ అంటే మనమూ ఢీ అందామని పార్టీ నేతలతో సీఎం అన్నారు. మోదీ సభకు వైకాపా కార్యకర్తలను తరలించడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రా నికి ఏమీ చేయకపోగా.. నిందలు మోపుదామనుకుంటే సహించొద్దని పిలుపునిచ్చారు. ప్రజలు తెదేపా పట్ల సాను కూలంగానే ఉన్నారన్న అతి విశ్వాసం నాయకులకు తగ దని సూచించారు. చివరి వరకూ అందరూ కష్టపడాల్సిం దేనని, ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దని సూచించారు. ఈసారి ఇన్‌ఛార్జిల వ్యవస్థ ఉండబోదని అధినేత తేల్చి చెప్పారు. ప్రజల్లో పార్టీ గెలుపు ఏకపక్షంగా ఉందని, దీన్ని అదునుగా చూసుకుని ఎవరైనా కష్టపడకుంటే ఉపేక్షించ బోనని హెచ్చరించారు. ప్రజలతో సత్సంబంధాలే తెలుగుదేశం పార్టీ గెలుపునకు పునాదులని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్ర బాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తిక విషయాలను పంచుకున్నారు. అంతేకాదు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. అటు కేంద్రం అడ్డంకులు, ఇటు ప్రతిపక్షం కుట్రలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యమస్ఫూర్తితో అంతా పని చేయాలని, రాబోయే 12రోజులు అందరూ సర్వశక్తులూ ఒడ్డాలని పార్టీ నేతలను ఆదేశించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని, వ్యవస్థల పతనాన్ని అడ్డుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఏపీ హక్కులను కాపాడుకోవాలని, విభజన హామీలు సాధిం చుకోవాలని నాయకులకు పిలుపునిచ్చారు.


