పంచకర్ల రమేశ్‌బాబు వసూళ్లరాజు
- 10 Views
- admin
- April 3, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
కన్నబాబురాజుది నేరస్వభావం————-
యలమంచిలి సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు——————-
యలమంచిలి, ఫీచర్స్ ఇండియా: అధికార ప్రతిపక్ష నేతలిద్దరూ ఐక్యంగా దోజుకుంటున్నారని పవన్‌కళ్యాణ్ విమర్శించారు. అధికారనేత పంచకర్ల రమేశ్‌బాబు 60శాతం, ప్రతిపక్ష వైసీపీ నేత 40శాతం వాటాలు వేసుకొని మరీ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. 11 గంటలకు ప్రారంభమౌతుందనుకొన్న సభ 2 గంటలకు ప్రారంభమైనా సభకు జనం అధికంగానే హాజరయ్యారు. భీమవరం నుంచి నేరుగా హెలికాప్టర్లో ఇక్కడకొచ్చిన పవన్ ప్రతిపక్ష నాయకుల్ని తీవ్రంగా దుయ్యబట్టారు. అనకాపల్లి ఎంపీగా నెగ్గిన తర్వాత అవంతి శ్రీనివాస్ ఉచితంగా పార్లమెంట్ ఉచిన క్యాంటీన్లో నిండా తిని భుక్తాయాసంతో నిద్రపోయేవారన్నారు. జైలుకెళ్ళొచ్చిన జగన్ ముఖ్యమంత్రి స్థానాన్నాసిస్తుంటే నిజాయితీ పరుడైన విజయకుమార్ ఎమ్మెల్యే పదవి నాశించడంలో తప్పేంటని ప్రశ్నించారు. ఇక్కడ ఇద్దరూ నేతలూ కూడబలుక్కొని దోపిడీ చేస్తుంటే మూడో నేత్రంగా ప్రజా నాయకుడిగా విజయకుమార్ యుద్దక్షేత్రంలోకి అడుగుపెట్టారన్నారు. మార్పుకోసం తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. జగన్‌లాగ ఎన్నివేల కోట్లు వెనకేసుకోవచ్చునన్నది లెక్కలు కట్టి రాజకీయాల్లోకి రాలేదనన్నారు. సినిమాల్లో కోట్లు సంపాదించుకొనే అవకాశం ఉన్న సమయంలోనే అన్నీ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చానన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ యలమంచిలి సభలో మంగళవారం ప్రసంగించారు. ఫ్యాన్ రెక్కలు విరిచేద్దామని ఓ జనసేన కార్యకర్త ఒకరు ఆవేశపడ్డారని, అది మన సంస్కృతి కాదని నచ్చజెప్పి, అలాంటి విధ్వంస చర్యలు జగన్‌కు నప్పుతాయోమో గాని మనకు సరిపోవని సూచిస్తూ, కావాలంటే ఫ్యాన్ తిరక్కుండా స్విచ్ ఆపేద్దామని చమత్కరించారు. కేజీఆర్ బిస్కట్ల కోసం జగన్ దేవురిస్తున్నారని, పులివెందుల పౌరుషం అంటూ గొప్పలు చెప్పుకొనే మాటలు ఏమయ్యాయని ఎద్దేవా చేశారు. చుర్రున ఎండ కాస్తున్నా లెక్కచేయకుండా అభిమానులు సభను విజయవంతం చేశారు. ఇందులో మిత్రపక్షాలైన సిపిఐ, సిపిఎం చెందిన ఆరుమండలాల నేతలు పాల్గొనడం విశేషం. మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


