ఏపీలో పవనే సీఎం
- 11 Views
- admin
- April 3, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
అధికారంలోకి వస్తే హోదా ఇస్తాం———
పవన్‌కు యూత్‌లో ఫాలోయింగ్ ఉంది——–
పవన్ కళ్యాణ్‌తో సంయుక్త సమావేశంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి—————–
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : మంచి పాలన అందించాలనే ఉద్దేశంతోనే జనసేనతో బీఎస్పీ పొత్తుపెట్టుకుందని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ అభివద్ధి చేయలేదని ఆమె విమర్శిం చారు. అభివద్ధే చేసుంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని అభిప్రాయ పడ్డారు. అయితే, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ప్రాంతీయ పార్టీల పాలనలోనూ అలాంటి పరిస్థితే ఉందని మాయ ధ్వజమెత్తారు. మా కూటమి అధికారంలోకి వస్తుందని, పవన్ కల్యాణే సీఎం అవుతారని ఉద్ఘాటించారు. బుధవారం విశాఖలో పవన్, మాయావతి సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ మంచి పాలన అందించాలనే ఉద్దేశంతోనే జనసేనతో బీఎస్పీ పొత్తుపెట్టుకుందని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ అభివద్ధి చేయలేదని ఆమె విమర్శించారు. అభివద్ధే చేసుంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని అభిప్రాయపడ్డారు. అయితే, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ప్రాంతీయ పార్టీల పాలనలోనూ అలాంటి పరిస్థితే ఉందని మాయ ధ్వజమెత్తారు. మా కూటమి అధికారంలోకి వస్తుందని, పవన్ కల్యాణే సీఎం అవుతారని ఉద్ఘాటించారు. పవన్ లాంటి యువ నాయకులు రాజకీయాల్లోకి రావడం శుభపరిణామని, యూత్‌లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉందని అన్నారు. కమ్యూనిస్టులు కలిసి రావడం జనసేనకు చాలా మంచిదని మాయ పేర్కొన్నారు. ఏపీ ప్రజలు కొత్త తరం నేతలను కోరుకుంటున్నారని, అందుకే కొత్త పార్టీ అయిన జనసేనతోనే కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు ఆమె తెలియజేశారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బలహీన వర్గాల ప్రజలే అధికమని, దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌కు ఒక దళిత మహిళ ముఖ్యమంత్రి కాగలిగిందని అన్నారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవంతో దేశాన్ని పాలిస్తానని మాయావతి వెల్లడించారు. యూపీలో తన పాలన హిందూ-ముస్లిం ఐక్యతగా సాగిందని గుర్తుచేశారు. హామీలను నెరవేర్చనందునే ఢిల్లీ పీఠానికి కాంగ్రెస్ దూరమైందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం కూడా మాటనిలబెట్టుకోలేదని, ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ దెందూ దొందేనని ధ్వజమెత్తారు. మా కూటమి విజయవంత మవుతుందని.. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుతుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో దళితులు ఓట్లతో శాసిస్తారని, అన్ని వర్గాలను అభివద్ధి చేస్తామని మాయ హామీ ఇచ్చారు. తాము కేంద్రంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని ఆమె పునరుద్ఘాటించారు.
పవన్ మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో నాటి పరిస్థితులను బట్టి టీడీపీ, బీజేపీలతో కలిసి ముందుకు వెళ్లామని పేర్కొన్నారు. మాయా వతికి సాదర స్వాగతం పలుకుతున్నామని అన్నారు. మాయావతి ప్రధాని కావడం ఖాయమని, ఆమె సమర్ధత దేశానికి అవసరమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దారితప్పిన సొంత ఎమ్మెల్యేలనే మాయావతి క్షమించలేదని పవన్ ప్రశంసలు కురిపించారు.


