ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలి
- 12 Views
- admin
- April 8, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
————–ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రమణ్యం————
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబందించి జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికార్లు సమన్వయంతో ఎటువంటి లోటుపాట్లు లేకుండా భారత ఎన్నికల కమిషన్ నియమనిబందనల కనుగుణంగా ప్రశాంత వాతావరణంలో విధులను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రమణ్యం పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11న జరిగే ఎన్నికలను అందరి సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. ఎన్నికల సమయం తక్కువగా ఉన్నందున పోలింగ్ కు సంబందించిన ఏర్పాట్లను పగడ్బందిగా నిర్వహించాలన్నారు. ఎంసీసీ, సెక్టోరల్, ఫ్లయింగ్ స్వాడ్ల అధికారులు వారికి కేటాయించిన విధులను తూ.చ తప్పకుండా నిర్వర్తించాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును కల్పించాల్సిందిగా పోలీసు అధికారులను సూచించారు. చాలా ప్రాంతాలలో ఓటర్లను ప్రలోభ పరిచే విధంగా నగదు పంపిణి, పలు ఎలక్ట్రానిక్ వస్తువులు, లిక్కర్ లు తదితరాలను పంపిణీ చేస్తున్నట్లు తమ దష్టికి వచ్చిందని, ఎంసీసీ టీమ్ లు, ఇన్ కం ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు షోరూమ్ లను, గోడౌన్లను అనుక్షణం ముమ్మర తనిఖీలను గావించాలన్నారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకష్ణ ద్వివేది మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నియమావళిని ఖచ్చితంగా పాటించాలన్నారు. ఓటర్ల స్లిప్ లను బీఎల్ఓ ల ద్వారానే పంపిణీ చేయాలన్నారు. ప్రతి ఓటరు స్వేచ్చగా తన ఓటును వినియోగించుకొనే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. నియమావళిని ఉల్లంఘించిన వారిపై నిబంధనల మేరకు కేసులను నమోదు చేయాలన్నారు. ఎన్నిలకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కాటమనేని భాస్కర్ వివరించారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో కావల్సిన అన్ని మౌళిక వసతులను కల్పించడం జరిగిందన్నారు. దివ్యాంగుల కొరకు వీల్ చైర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏజెన్సీ ప్రాంత మండలాలలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్రలడ్డా, ఎస్పి అట్టాడ బాపూజీ తదితరులు పాల్గొన్నారు.


